Gold Rate: మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర..New Price ఎంతంటే.!
Gold Rate: మార్కెట్ లో మళ్ళీ బంగారం ధర పడిపోతోంది
ఇప్పటికే గడిచిన 10 రోజుల్లో భారీగా తగ్గిన బంగారం ధర
బంగారం ధర ఈరోజు కూడా అదే దారిలో కొనసాగింది
Gold Rate: మార్కెట్ లో మళ్ళీ బంగారం ధర పడిపోతోంది. ఇప్పటికే గడిచిన 10 రోజుల్లో భారీగా తగ్గిన బంగారం ధర ఈరోజు కూడా అదే దారిలో కొనసాగింది. మార్కెట్ నిపుణులు చెబుతున్న బాటలు విరుద్ధంగా బంగారం దగర ఎప్పటి కప్పుడు పడిపోతూనే వుంది. గోల్డ్ రేట్ గత నెలలో ఈ సంవత్సరం గరిష్టాన్ని నమోదు చెయ్యగా, ఈ నెలలో మాత్రం రోజు రోజుకు పడిపోతూ వస్తోంది. అయితే, ఈరోజు నడుసున్న దారిలోనే గోల్డ్ రేట్ నడుస్తుందా? లేక ఎటువంటి పరిణామాలను చూస్తుందో తెలుసుకోండి.
Today Gold Rate:
ఈరోజు మార్కెట్ లో నడుస్తున్న బంగారం ధరను చూస్తే, ఈరోజు దేశంలోని ప్రధాన మార్కెట్ లో ఈరోజు ఒక తులం బంగారం రూ. 61,470 రూపాయల వద్ద మొదలై రూ. 61,360 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది. అంటే, ఈరోజు బంగారం ధర తులానికి రూ. 110 రూపాయలు క్రిందకు దిగింది.
గడిచిన 10 రోజుల గోల్డ్ రేట్ అప్డేట్
పైన తెలిపి ప్రకారం, ఈరోజు బంగారం ధరలో పెద్దగా మార్పు లేక పోయినా గడిచిన 10 రోజుల గోల్డ్ రేట్ అప్డేట్ ను పరిశీలిస్తే, గడిచిన 10 రోజుల్లో బంగారం ధర తులానికి రూ. 1,200 రూపాయలకు పైగా పడిపోయింది. అక్టోబర్ 29 న ఒక తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ. 62,630 రూపాయలుగా ఉండగా, ప్రస్తుతం ఈరోజు ఒక తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ. 61,360 రూపాయల వద్ద కొనసాగుతోంది.
Also Read : New Smart Watch Launched: పెద్ద డిస్ప్లేతో కొత్త స్మార్ట్ వాచ్ లాంచ్ చేసిన Promate.!
24 Carat బంగారం రేటు
ఇక ఈరోజు మార్కెట్ లో కొసాగుతున్న 24 Carat బంగారం రేటు విషయానికి వస్తే, ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర రూ. 61, 360 రూపాయల వద్ద నడుస్తోంది.
22 Carat బంగారం రేటు
ఇక 24 Carat బంగారం రేటును ను చూస్తే, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ ఆర్నమెంట్ బంగారం ధర రూ. 56,250 రూపాయల వద్ద కొనసాగుతోంది.
గమనిక : ఆన్లైన్ బంగారం ధర మరియు లోకల్ మార్కెట్ బంగారం ధరలలో మార్పులు ఉంటాయని గమనించాలి.