Great News: వరసగా రెండవ రోజు కూడా తగ్గిన గోల్డ్ రేట్.. ఈరోజు Gold Update తెలుసుకోండి.!

Great News: వరసగా రెండవ రోజు కూడా తగ్గిన గోల్డ్ రేట్.. ఈరోజు Gold Update తెలుసుకోండి.!
HIGHLIGHTS

రోజు కూడా భారత మార్కెట్ లో గోల్డ్ రేట్ పడిపోయింది

నిన్న స్వల్పంగా క్రిందకు దిగజారిన గోల్డ్ రేట్

ఈరోజు కూడా Gold Rate స్వల్పంగా క్రిందకు దిగింది

Great News: ఈరోజు కూడా భారత మార్కెట్ లో గోల్డ్ రేట్ పడిపోయింది. నిన్న స్వల్పంగా క్రిందకు దిగజారిన గోల్డ్ రేట్, అదే ట్రెండ్ ను ఫాలో అవుతూ ఈరోజు కూడా స్వల్పంగా క్రిందకు దిగింది. అయితే, ఈరోజు కూడా గోల్డ్ రేట్ 60 వేల మార్క్ వద్దనే కొసాగుతోంది. కానీ, ఈ రెండు రోజుల్లో గోల్డ్ రేట్ దాదాపుగా 300 రూపాయలకు పైగా పడిపోయింది. సెప్టెంబర్ నెల ప్రారంభం నుండి ఈరోజు వరకూ కొనసాగిన గోల్డ్ రేట్ ప్రయాణంతో పాటుగా ఈరోజు Gold Update కూడా తెలుసుకోండి. 

Gold Price Update

ఈరోజు ప్రధాన మార్కెట్ లో రూ. 60,160 రూపాయల వద్ద మొదలైన 10 గ్రాముల 24K బంగారం ధర రూ. 160 రూపాయలు దిగజారి రూ. 60,000 రూపాయల వద్ద క్లోజింగ్ ను సెట్ చేసింది. ఈ నెల ప్రారంభం నుండి ఇదే కనిష్ట ధర మరియు ఈరోజు మార్కెట్ నష్టాలను చూసింది. అలాగే, ఈరోజు రూ. 55,150 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22K బంగారం ధర రూ. 150 రూపాయలు క్రిందకు దిగి రూ. 55,000 రూపాయల వద్ద క్లోజింగ్ ను సెట్ చేసింది. 

Also Read: Moto G54 5G: 12GB RAM హెవీ స్టోరేజ్ తో వచ్చిన సెగ్మెంట్ First Powerful Phone

ఈరోజు కూడా చెన్నై మార్కెట్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మార్కెట్ ల కంటే గరిష్ట రేటును నమోదు చేసింది. ఈరోజు చెన్నై మార్కెట్ లో 10 గ్రాముల 24K గోల్డ్ రేట్ రూ. 60,330 రూపాయల వద్ద క్లోజ్ అయ్యింది మరియు 10 గ్రాముల 22K ఆర్నమెంట్  బంగారం ధర రూ. 55,300 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.

Also Read:  New Look తో కొత్త బడ్జెట్ 5G Phone లాంచ్ చేసిన రియల్ మి.. ధర ఎంతంటే | Tech News

Gold Rate

ఈ నెల ప్రారంభంలో ఒక తులం 24 క్యారెట్ స్వచ్చమైన బంగారం ధర రూ. 60,050 రూపాయల వద్ద మొదలై సెప్టెంబర్ 4వ తేదీ రూ. 60,320 రూపాయల గరిష్ట రేటును నమోదు చేసింది. అయితే, నిన్న మరియు ఈరోజు కూడా గోల్డ్ రేట్ నష్టాలను చవి చూసి రూ. 360 రూపాయలు క్రిందకు దిగి ఈరోజు రూ. 60,000 వద్ద నడుస్తోంది. 

గమనిక: ఆన్లైన్ గోల్డ్ రేట్ మరియు లోకల్ గోల్డ్ రేట్ లలో మార్పులు ఉంటాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo