Gold Rate: కుప్పకూలిన బంగారం ధర..నాలుగు నెలల కనిష్ఠానికి సూచీలు.!

Gold Rate: కుప్పకూలిన బంగారం ధర..నాలుగు నెలల కనిష్ఠానికి సూచీలు.!
HIGHLIGHTS

బంగారం కొనాలని చూస్తున్న పసిడి ప్రియులకు ఈరోజు గోల్డ్ మార్కెట్ శుభవార్త

ఈరోజు మార్కెట్ లో బంగారం ధర నెల చూపులు చూసిన పసిడి

బంగారం ధర గత నాలుగు నెలల్లో 58 వేల మార్క్ వద్దకు చేరుకోవడం ఇదే మొదటిసారి

బంగారం కొనాలని చూస్తున్న పసిడి ప్రియులకు ఈరోజు గోల్డ్ మార్కెట్ శుభవార్తను, గోల్డ్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లకు చేదు వార్తను అందించింది. అదేమిటి అలా చెబుతున్నాను అనుకుంటున్నారా? ఈరోజు Gold Rate ను చూస్తే మీరు కూస్తో నిజమే అంటారు. ఎందుకంటే, ఈరోజు దేశీయ మార్కెట్ లో గోల్డ్ రేట్ తులానికి రూ. 650 రూపాయల పతనాన్ని చూసింది. గడిచిన రెండు రోజులతో పాటుగా ఈరోజు మార్కెట్ లో బంగారం ధర నెల చూపులు చూడటం పసిడి ప్రియులకు మంచి హాట్ న్యూస్ కాగా, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసిన వారికి బ్యాడ్ న్యూస్ గా మారింది.

Today’s Gold Rate

ఈరోజు గోల్డ్ మార్కెట్ కొనసాగిన వివరాల్లోకి వెళితే, ఉదయం రూ. 59,450 రూపాయల వద్ద మొదలైన 10 గ్రాముల 24 క్యారెట్ స్వచ్ఛమైన గోల్డ్ రేట్ మెల్ల మెల్లగా క్రిందకు దిగుతూ సాయంత్రానికి రూ. 650 రూపాయల భారీ పతనాన్ని చూడటంతో రూ. 58,800 రూపాయల ధరను ఈరోజు క్లోజింగ్ గా నమోదు చేసింది. ఇది గత నెలల గోల్డ్ మార్కెట్ కనిష్టం మరియు బంగారం ధర గత నాలుగు నెలల్లో 58 వేల మార్క్ వద్దకు చేరుకోవడం ఇదే మొదటిసారి.

బంగారం ధర

ఇక 10 గ్రాముల 22క్యారెట్ గోల్డ్ రేట్ వివరాలికి వెళితే ఈరోజు రూ. 54,500 రూపాయల వద్ద ప్రారంభమైన బంగారం ధర రూ. 600 రూపాయల పతనాన్ని చూసి రూ. 53,900 రూపాయల క్లోజింగ్ ను నమోదు చేసింది.

Also Read: Amazon Great Indian Festival Sale అక్టోబర్ 8 నుండి స్టార్ట్..డీల్స్ ఎలా ఉన్నాయంటే.!

తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు బంగారం ధర ఎలా వుంది?

ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు బంగారం ధర ఎలా ఉందని పరిశీలిస్తే, ఈరోజు హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, వంటి తెలుగు రాష్ట్రాల ప్రధాన మార్కెట్ లలో ఈరోజు 10 గ్రాముల 24క్యారెట్ బంగారం ధర రూ. 58,800 వద్ద ఉండగా, 10 గ్రాముల 22క్యారెట్ బంగారం ధర రూ. 53,900 రూపాయల వద్ద వుంది.

అలాగే, దేశంలోని చాలా ప్రధాన మార్కెట్ లలో బంగారం ధరలు ఇదే విధంగా కొనసాగుతుండగా, చైన్నె మార్కెట్ లో మాత్రం ఈరోజు కొద బంగారం ధర 59 వేల రూపాయల మార్క్ పైనే కొనసాగుతోంది. ఈరోజు చెన్నై మార్కెట్ లో ఒక తులం 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర రూ. 59,020 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.

గమనిక: ఆన్లైన్ బంగారం ధర మరియు లోకల్ మార్కెట్ లోని బంగారం ధర లలో మార్పులు ఉంటాయని గమనించాలి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo