వారం ఈరోజుల తరువాత ఈరోజు గోల్డ్ మార్కెట్ నష్టాన్ని చూసింది. గత వారం మొత్తంగా పెరుగుతూ వచ్చిన పసిడి, 62 వేల మార్క్ వద్ద కొసాగుతోంది. అయితే, ఈరోజు మార్కెట్ లో పసిడి వేల వేల బోయింది. ఇన్వెస్టర్లకు బంగారు బాటగా కనిపించిన గోల్డ్ మార్కెట్ ఈరోజు మాత్రం క్రిందకు పడిపోయింది. మేరీ ఈరోజు మార్కెట్ లో తులం బంగారం రేట్ ఏవిధంగా కొనసాగుతోందో చూద్దామా.
ఈరోజు మార్కెట్ లో రూ. 61,910 ధర వద్ద ప్రారంభమయిన ఒక తులం 24K స్వచ్ఛమైన గోల్డ్ రేట్ రూ. 490 క్రిందకు దిగి రూ. 61,420 వద్ద ముగిసింది. అలాగే, ఒక తులం 22K గోల్డ్ రేట్ రూ. 56,750 మొదలై రూ. 56,300 వద్ద ముగిసింది. అంటే, 22K గోల్డ్ రేట్ 450 రూపాయలు క్రిందకు దిగింది.
ఇక ఈరోజు దేశంలోని ప్రధాన నగరాలలో గోల్డ్ రేట్ వివరాలు ఎలా ఉన్నాయని చూస్తే, ఈరోజు దేశరాజధాని ఢిల్లీలో 10గ్రా 24K రూ. 61,570 గా ఉండగా 10గ్రా 22K గోల్డ్ రేట్ రూ. 56,450 గా వుంది.
హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్టణం లో ఈరోజు ఒక తులం 24K బంగారం ధర రూ. 61,420 వద్ద కొనసాగుతుండగా, ఒక తులం 22K గోల్డ్ రేట్ రూ. 56,300 వద్ద కొనసాగుతోంది.
చెన్నై మరియు కోయంబత్తూర్ మార్కెట్ లు దేశం మొత్తంలో అధిక ధరలను నమోదు చేశాయి. ఈరోజు ఈ రెండు మార్కెట్ లలో 10గ్రా 24K పసిడి ధర రూ. 56,700 వద్ద ఉండగా, ఒక తులం 22K పసిడి ధర రూ. 61,850 వద్ద వుంది.
గమనిక: ఆన్లైన్ మార్కెట్ గోల్డ్ రేట్ మరియు లోకల్ మార్కెట్ రేట్ లలో మార్పులు ఉంటాయి