Gold Rate: గోల్డ్ మార్కెట్ ఢమాల్..ఎంత తగ్గిందంటే.!

Gold Rate: గోల్డ్ మార్కెట్ ఢమాల్..ఎంత తగ్గిందంటే.!
HIGHLIGHTS

గోల్డ్ మార్కెట్ ఈరోజు కూడా స్వల్పంగా క్రిందకు దిగింది

ప్రసుతం గోల్డ్ మార్కెట్ నష్టాలను చూస్తోంది

గోల్డ్ మార్కెట్ కనిష్ట ధర వైపుగా సాగుతోంది

Gold Rate: గోల్డ్ మార్కెట్ ఈరోజు కూడా స్వల్పంగా క్రిందకు దిగింది. అయితే, ఈ నెల గరిష్ట ధరతో పోలిస్తే బంగార ధర ఈరోజు వరకూ దాదాపుగా 2,000 రూపాయలకు పైగా పడిపోయింది. దీపావళి పండుగ తరువాత మొదలైన గోల్డ్ మార్కెట్ లాభాలను నమోదు చెయ్యడంతో గోల్డ్ రేట్ పైపైకి చేరుకుంది. డిసెంబర్ 4 నాటికీ బంగారం ధర ఈ సంవత్సరంలో ఎన్నడూ చూడని గరిష్ట ధరను నమోదు చేసింది. అయితే, అంతర్జాతీయ గోల్డ్ మార్కెట్ మరియు డాలర్ తో రూపాయి మారకం దెబ్బకి మళ్ళీ నేల చూపులు చూసింది.

Gold Rate Update:

ప్రసుతం గోల్డ్ మార్కెట్ నష్టాలను చూస్తోంది మరియు కనిష్ట ధర వైపుగా సాగుతోంది. గడిచిన మూడు రోజుల్లో బంగారం ధర రూ. 1,040 రూపాయల వరకూ క్రిందకు దిగజారింది. ఇక ఈ నెలలో ఇప్పటి వరకు సాగిన గోల్డ్ మార్కెట్ ను పరిశీలిస్తే దాదాపుగా రూ. 2,210 రూపాయలు క్రిందకు దిగింది మరియు 61 వేల రూపాయల మార్క్ ను చేరుకుంది. ఇదే ట్రెండ్ కొనసాగితే పసిడి ప్రియులకు గోల్డ్ కొనుగోలు చేసే అవకాశం మరింత చేరువవుతుంది.

gold rate and 999.9 fine gold bars
గోల్డ్ రేట్ అప్డేట్

ఈరోజు 24 క్యారట్ గోల్డ్ రేట్ అప్డేట్

ఈరోజు 24 క్యారట్ గోల్డ్ రేట్ అప్డేట్ విషయానికి వస్తే, ఈరోజు ఉదయం రూ. 62,130 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర మార్కెట్ ముగిసే సమయానికి రూ. 220 రూపాయలు నష్టాన్ని చూసింది. అందుకే, ఈరోజు గోల్డ్ రేట్ రూ. 61,910 రూపాయల క్లోజింగ్ ను నమోదు చేసింది.

Also Read : 8 వేలకే 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు FHD+ డిస్ప్లే ఫోన్ కోసం చూస్తున్నారా?

ఈరోజు 22 క్యారట్ గోల్డ్ రేట్ అప్డేట్

ఇక ఈరోజు 24 క్యారట్ గోల్డ్ రేట్ అప్డేట్ ను చూస్తే, ఉదయం రూ. 56,950 రూపాయల వద్ద మొదలైన 10 గ్రాముల 22 క్యారెట్ ఆర్నమెంట్ బంగారం ధర రూ. 56,750 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది. అంటే, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ ఆర్నమెంట్ బంగారం ధర రూ. 200 రూపాయలు క్రిందకు దిగజారింది.

గమనిక: లోకల్ మార్కెట్ మరియు ఆన్లైన్ గోల్డ్ ధరలలో మార్పులు ఉంటాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo