Gold Rate: ఈరోజు కూడా పడిపోయిన బంగారం ధర..అప్డేట్ తెలుసుకోండి.!

Gold Rate: ఈరోజు కూడా పడిపోయిన బంగారం ధర..అప్డేట్ తెలుసుకోండి.!
HIGHLIGHTS

ఫిబ్రవరి 20 నుండి మొదలైన గోల్డ్ మార్కెట్ పతనం

గత 10 రోజులుగా బంగారం ధర మెల్లగా పడిపోతూనే వస్తోంది

ఈరోజు కూడా గోల్డ్ మార్కెట్ స్వల్పంగా క్రిందకు దిగింది

Gold Rate: ఫిబ్రవరి 20 నుండి మొదలైన గోల్డ్ మార్కెట్ పతనం ఆగకుండా కొనసాగుతోంది. గత 10 రోజులుగా బంగారం ధర మెల్లగా పడిపోతూనే వస్తోంది. అంతేకాదు, ఈరోజు కూడా గోల్డ్ మార్కెట్ స్వల్పంగా క్రిందకు దిగింది. అయితే, గోల్డ్ రేట్ ఎక్కువ మొత్తంలో తగ్గుదలను మాత్రం నమోదు చెయ్యలేదు. కానీ, ఈ 10 రోజులలో తులానికి దాదాపుగా 1,000 రూపాయల వరకు బంగారం ధర క్రిందకు దిగింది. ఈరోజు గోల్డ్ మార్కెట్ అప్డేట్ ఏమిటో ఒక లుక్కేద్దామా. 

Gold Rate:

ఈరోజు ఉదయం రూ.51,500 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయలు క్రిందకు దిగి రూ.51,350 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,180 నుండి క్రిందకు దిగి రూ.56,020 రూపాయల వద్దకు చేరుకుంది.    

ఈరోజు బంగారం ధర

ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,350 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,020 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,350 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,020 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,500 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.56,170 గా ఉంది. అలాగే, ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నై లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,010 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,740 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo