బంగారం కొనాలనుకునే వారికి గొప్ప శుభవార్త.!

బంగారం కొనాలనుకునే వారికి గొప్ప శుభవార్త.!
HIGHLIGHTS

బంగారం కొనాలనుకునే వారికి గొప్ప శుభవార్త

ఈరోజు కూడా బంగారం ధర తగ్గింది మరియు బంగారం 14 నెలల కనిష్ఠానికి చేరుకుంది

మార్కెట్లో బంగారం ధర కొనుగోలుదారులకు ఆశాజనకంగానే కనిపిస్తోంది

బంగారం కొనాలనుకునే వారికి గొప్ప శుభవార్త. ఈరోజు కూడా బంగారం ధర తగ్గింది మరియు బంగారం 14 నెలల కనిష్ఠానికి చేరుకుంది. ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధర ను పరిశీలిస్తే, కొనుగోలుదారులకు ఆశాజనకంగానే కనిపిస్తోంది. గత వారం నుండి పడిపోతూ వచ్చిన గోల్డ్ రేట్, ఈరోజు కూడా మార్కెట్ లో స్వల్పంగా తగ్గింది. మరి ఈరోజు దేశంలో గోల్డ్ మార్కెట్ ఎలా ఉన్నదో తెలుసుకుందామా. 

నిన్న10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 45,950 రూపాయలుగా ఉండగా, ఈరోజు స్వల్పంగా తగ్గి 45,850 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.50,000 వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,850 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,010 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,860 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,020 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,850 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,000 గా ఉంది. ఈరోజు కూడా    దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,320 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,530 గా ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo