Gold Rates Today: భారీగా తగ్గుతున్న బంగారం ధర..ఈరోజు రేటు ఎంతంటే.!
బంగారం ధరలు రోజు రోజుకు దారుణంగా పడిపోతున్నాయి.
ఈరోజు కూడా గోల్డ్ మార్కెట్ క్రిందకు పడిపోయింది
తులానికి రూ. 900 వరకు క్రిందకు దిగిన బంగారం ధర
Gold Rates Today: బంగారం ధరలు రోజు రోజుకు దారుణంగా పడిపోతున్నాయి. జూన్ 15న, అనగా ఈరోజు కూడా గోల్డ్ మార్కెట్ క్రిందకు పడిపోయింది. ఈ వారంలో ఇప్పటికే తులానికి రూ. 500 వరకూ తగ్గిన గోల్డ్ రేట్, ఈరోజు కూడా తులానికి 380 రూపాయల వరకు తగ్గింది. అంటే, ఈఆ నాలుగు రోజుల్లోనే బంగారం ధర తులానికి రూ. 900 వరకు క్రిందకు దిగినట్లు చూడవచ్చు. జూన్ 15, ఈరోజు గోల్డ్ మార్కెట్ అప్డేట్ మరియు లేటెస్ట్ రేట్ల వివరాలను పరిశీలిద్దామా.
Gold Rate Today:
నిన్న రూ. 60, 450 వద్ద మొదలై రూ. 60,050 వద్ద ముగిసిన 10 గ్రా 24K బంగారం ధర, ఈరోజు రూ. 60,050 వద్ద మొదలై రూ. 59,670 రూపాయల వద్ద ముగిసింది. అలాగే, నిన్న రూ. 55,400 వద్ద మొదలై రూ. 55,050 వద్ద ముగిసిన 10 గ్రా 22K గోల్డ్ రేట్, ఈరోజు రూ. 55,050 వద్ద మొదలై రూ. 54,700 రూపాయల వద్ద ముగిసింది.
అంటే, గడిచిన రెండు రోజులు కూడా గోల్డ్ మార్కెట్ నష్టాలను చవి చూసింది మరియు మూడు నెలల కనిష్ఠాన్ని కూడా ఈరోజు నమోదు చేసింది. అంతేకాదు, చాలా కాలం తరువాత గోల్డ్ మార్కెట్ 60 వేల రూపాయల దిగువకు చేరినట్లు కూడా మనం చూడవచ్చు.
ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, వరంగల్, వైజాగ్ మరియు నిజామాబాద్, ఖమ్మం వంటి చాలా ప్రధాన నగరాలలో పైన సూచించిన రేట్ లను గోల్డ్ మార్కెట్ నమోదు చేసింది.