Gold Price: రెండు నెలల కనిష్ఠాన్ని తాకిన గోల్డ్ రేట్.!
రెండు నెలల కనిష్ఠాన్ని తాకిన గోల్డ్ రేట్
రెండు వారాల్లో గోల్డ్ రేట్ దాదాపుగా రూ. 1,000 తగ్గింది
బంగారం ధర రోజు రోజుకు క్రిందకు పడిపోతూనే వుంది
Gold Price: ఈరోజు అనూహ్యంగా మార్కెట్ లో రెండు నెలల కనిష్ఠాన్ని తాకిన గోల్డ్ రేట్. గత రెండు వారాల్లో గోల్డ్ రేట్ దాదాపుగా రూ. 1,000 తగ్గింది మరియు ప్రస్తుతం రెండు నెలల కనిష్ఠ ధర వద్ద గోల్డ్ మార్కెట్ కొనసాగుతోంది. ఏప్రిల్ తరువాత తగ్గుముఖం పట్టిన బంగారం ధర రోజు రోజుకు క్రిందకు పడిపోతూనే వుంది. జూన్ 14 న, అంటే ఈరోజు గోల్డ్ మార్కెట్ రేట్ మరియు మార్కెట్ అప్డేట్ వివరాలను తెలుసుకోండి.
Gold Price: జూన్ 14
జూన్ 14, ఈరోజు కూడా మార్కెట్ లో గోల్డ్ ధర క్రిందకు దిగింది. ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 60,450 వద్ద మొదలై రూ. 60,050 వద్ద ముగిసింది. అంటే, ఈరోజు గోల్డ్ రేట్ తులానికి రూ. 400 రూపాయలు క్రిందకు దిగింది. అలాగే, 10 గ్రాముల 22K ఆర్నమెంట్ బంగారం ధర రూ. 55,400 వద్ద మొదలై రూ. 55,050 వద్ద ముగిసినది.
ఓవరాల్ గా ఈ వారంలో ఇప్పటికే తులానికి రూ. 500 వరకూ గోల్డ్ రేట్ క్రిందకు దిగింది.
తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు గోల్డ్ రేట్
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు గోల్డ్ రేట్ విషయానికి వస్తే, ఈరోజు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో 10 గ్రాముల 24K స్వచ్ఛమైన బంగారం ధర రూ. 60,050 వద్ద కొనసాగుతుండగా, 10 గ్రాముల 22K బంగారం ధర రూ. 55,050 వద్ద కొనసాగుతోంది.
ఇక గడిచిన రెండు వారాల గోల్డ్ రేట్ ను పరిశీలిస్తే, రూ. 61,100 వద్ద మొదలైన ఒక తులం 24K గోల్డ్ రేట్ ఈరోజు రూ. 60,050 వద్ద వుండగా రూ. 56,000 వద్ద మొదలైన ఒక తులం 22K ఆర్నమెంట్ గోల్డ్ రేట్ రూ. 55,050 వద్ద ఉంది.
గమనిక: ఒక్కడా సూచించిన ఆన్లైన్ గోల్డ్ రేట్ మరియు లోకల్ గోల్డ్ రేట్ లలో మార్పులు ఉంటాయి.