Gold Rate Drop: ఈరోజు కూడా మార్కెట్ లో బంగారం ధర పడిపోయింది. నిన్న మార్కెట్ లో బంగారం ధర దారుణంగా పడిపోయింది మరియు ఈరోజు కూడా గోల్డ్ రేట్ మరింతగా పడిపోయింది. అంతేకాదు, ఈరోజు బంగారం ధర గత పదిరోజుల కనిష్ట రేటును చేరుకుంది. ఈ నెల ప్రారంభం నుండి భారీ పెరుగుదలను చూసిన గోల్డ్ మార్కెట్ ఈరోజు మాత్రం నెల చూపులు చూసింది. మరి ఈరోజు మార్కెట్ లో కొనసాగుతున్న లైవ్ గోల్డ్ రేట్ అప్డేట్ మరియు ప్రైస్ వివరాలను పరిశీలిద్దామా.
ప్రస్తుతం బంగారం ధర అంచనాలను మించి కొనసాగుతోంది. ఎందుకంటే, డిసెంబర్ నెల ప్రారంభం నుండి బంగారం ధరలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. డిసెంబర్ 1వ తేదీ రూ. 62,730 రూపాయల వద్ద ఒక తులం బంగార ధర ప్రారంభం అయ్యింది. అయితే, డిసెంబర్ 1వ తేదీ నుండి బంగారం ధర అంచెలంచలుగా పెరిగిన గోల్డ్ రేట్ డిసెంబర్ 4న తారాస్థాయికి చేరుకుంది. డిసెంబర్ 4న బంగారం ధర భారీ పెరుగుదలను చూసి రూ. 64,200 రూపాయల వద్ద నిలిచింది.
కానీ, డిసెంబర్ 5 న అనుకోకుండా మార్కెట్ లో విపరీత పరిణామాలు చేటు చేసుకోవడంతో గోల్డ్ మార్కెట్ పడిపోయింది. డిసెంబర్ 5 న 10 గ్రాముల బంగారం ధర రూ. 1,090 రూపాయలు క్రిందకు దిగజారి రూ. 63,110 రూపాయలకు చేరుకుంది. తరువాత రోజు కూడా ఇదే ట్రెండ్ ఫాలో అయిన గోల్డ్ మార్కెట్ డిసెంబర్ 6 న మళ్ళి తులానికి రూ. 440 రూపాయలు క్రిందకు దిగడంతో రూ. 62,670 రూపాయల క్లోజింగ్ ను సెట్ చేసింది.
Also Read : Infinix Smart 8 HD: 6 వేల కంటే తక్కువ ధరకే ఐఫోన్ 15 మాదిరి ఫీచర్ ఉన్న ఫోన్ వస్తోంది
మార్కెట్ ప్రారంభ సమయానికి ప్రసుతం 10 గ్రాముల 24 Carat స్వచ్ఛమైన గోల్డ్ రేట్ రూ. 62,780 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 22 Carat ఆర్నమెంట్ బంగారం ధర రూ. 57,550 రూపాయల వద్ద కొనసాగుతోంది.
గమనిక: ఆన్లైన్ గోల్డ్ రేట్ మరియు లోకల్ మార్కెట్ గోల్డ్ రేట్ లలో మార్పులు ఉంటాయి.