Gold: పసిడి ప్రియులకు ఊరట.. దిగొచ్చిన బంగారం ధర.!

Updated on 17-Oct-2022
HIGHLIGHTS

దీపావళి పండుగ సందర్భంగా బంగారం కొనాలని ఆలోచిస్తున్న వారికి ఊరట లభించింది

ప్రస్తుతం మార్కెట్ లో బంగారం ధర దిగొచ్చింది

బంగారం ధర రోజు రోజుకూ క్రిందకు పొడిపోతూ వచ్చింది

దీపావళి పండుగ సందర్భంగా బంగారం కొనాలని ఆలోచిస్తున్న వారికి ఊరట లభించింది. ప్రస్తుతం మార్కెట్ లో బంగారం ధర దిగొచ్చింది. ఈ నెలలో దాదాపుగా 53,000 రూపాయల వరకూ చేరుకున్న తులం బంగారం ధర రోజు రోజుకూ క్రిందకు పొడిపోతూ వచ్చింది. ఎట్టకేలకు అక్టోబర్ 15 వ తేదీకి తులం బంగారం ధర 50,400 రూపాయలకు చేరుకుంది. అయితే, గత రెండు రోజుల్లో స్వల్పంగా పెరిగి, ఈరోజు 50,680 రూపాయల వద్ద కొనసాగుతొంది. తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలూ మరియు దేశరాజధానిలో ఈరోజు  గోల్డ్ రేట్ ఎలా ఉన్నదో తెలుసుకోండి.                       

Gold:

నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,450 రూపాయలుగా ఉండగా, ఈరోజు కూడా స్థిరంగా నిలబడిన గోల్డ్ మార్కెట్ 46,460 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.50,680 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,460 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,680 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,480 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,680 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,460 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.50,680 గా ఉంది. ఈరోజు కూడా   దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,910 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,710 గా ఉంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :