గత కొన్ని రోజులుగా పడిపోతూ వస్తున్న గోల్డ్ సూచీలు ఈరోజు కూడా నేల చూపులు చేశాయి. ఈరోజు బంగారం ధర తగ్గడమే కాకుండా మరొకసారి మూడు నెలల కనిష్ఠాన్ని కూడా నమోదు చేసింది. జూన్ 15 వ తేదీ నాడు నమోదు అయిన రేటునే ఈరోజు కూడా గోల్డ్ మార్కెట్ నమోదు చేసింది. అయితే, జూన్ 15 తేదీ తరువాత గోల్డ్ రేట్ ఒక్కసారిగా పెరగడంది. మరి ఇప్పుడు ఎలాంటి పరిణామాలను గోల్డ్ మార్కెట్ చూస్తోందో వేచి చూడాలి.
ఇక ఈరోజు మార్కెట్ లో గోల్డ్ రేట్ అప్డేట్ మరియి వివరాలను చూసినట్లయితే, ఈరోజు రూ. 60,000 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర రూ. 330 రూపాయలు క్రిందకు దిగి రూ. 59,670 రూపాయల వద్ద ఈరోజు క్లోజింగ్ ను నమోదు చేసింది. అలాగే, రూ. 55,000 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ. 300 రూపాయలు క్రిందకు దిగి రూ. 54,700 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.
ఈరోజు తెలుగు రాష్ట్రాలలో 10 గ్రాముల 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర రూ. 59,670 గా ఉండగా, 10 గ్రాముల 22 క్యారెట్ ఆర్నమెంట్ బంగారం ధర రూ. 54,700 రూపాయలుగా వుంది. ఈరోజు గోల్డ్ మార్కెట్ గత మూడు నెలల కనిష్ఠంలో కొనసాగుతోంది.
దేశం మొత్తం మీద ఈరోజు చెన్నై మార్కెట్ గరిష్ట గోల్డ్ రేట్ ను నమోదు చేసింది. ఈరోజు చెన్నై మార్కెట్ లో ఒక తులం గోల్డ్ 24K రేట్ ను రూ. 60,050 గా నమోదు చెయ్యగా, ఒక తులం 22K గోల్డ్ రేట్ ను రూ. 55,050 రూపాయల వద్ద నమోదు చేసింది.
గమనిక: ఆన్లైన్ మరియు లోకల్ మార్కెట్ గోల్డ్ రేట్ లావు మార్పులు ఉంటాయి.