ప్రస్తుతం మార్కెట్ లో Gold Rate భారీగా పతనమవుతోంది. గత వారం మొత్తం భారీగా పడిపోయిన బంగారం ధర ఈరోజు కూడా అదే ట్రెండ్ ను కొనసాగిస్తోంది. వాస్తవానికి, రీసెంట్ గా నిపుణులు తెలిపిన గోల్డ్ రేట్ భవిష్య వాణి ఒట్టిమాటే అని కూడా తేలిపోయింది. అయితే, గోల్డ్ రేట్ దీపావళి పండుగ నాటికి పెరుగుతుందని నిపుణులు సూచించారు. మరి చూడాలి దీపావళి నాటికి మార్కెట్ లో బంగారం ధర ఎలా ఉంటుందో వేచి చూడాలి.
ఈరోజు కూడా మార్కెట్ లో బంగారం ధర తగ్గు ముఖం పట్టింది. నిన్నటితో పోలిస్తే ఈరోజు మార్కెట్ లో బంగారం ధర తులానికి రూ. 210 రూపాయల పతనాన్ని చూసింది. ఈరోజు గోల్డ్ మార్కెట్ వివరాలు మరియు గోల్డ్ రేట్ లను పరిశీలిద్దాం.
Also Read : Amazon కిక్ స్టార్టర్ సేల్ నుండి TCL QLED స్మార్ట్ టీవీ పైన బిగ్ డీల్| New Offer
ఈరోజు ఉదయం రూ. 57,370 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.210 రూపాయలు క్రిందకు దిగజారి రూ. 57, 160 రూపాయల వద్ద కొనసాగుతోంది.
ఇక 22 క్యారెట్ గోల్డ్ రేట్ విషయానికి వస్తే, ఈరోజు ఉదయం రూ. 52,590 రూపాయల వద్ద మొదలైన 10 గ్రా|| 22 క్యారెట్ బంగారం ధర రూ. 190 రూపాయలు పతనమై రూ. 27,400 రూపాయల వద్ద కొనసాగుతోంది.
అక్టోబర్ 1 నుండి కొనసాగిన గోల్డ్ మార్కెట్ మరియు గోల్డ్ రేట్ వివరాలోకి వెళితే, అక్టోబర్ 1వ తేదీ రూ. 58,200 రూపాయల మొదలైన గోల్డ్ మార్కెట్ 5 రోజుల్లో రూ. 1,040 రూపాయలు పతనమై రూ. 57,160 రూపాయల వద్దకు చేరుకుంది.
Also Read: Netflix Free Subscription తో కొత్త అఫర్ తీసుకు వచ్చిన Reliance Jio| New Plan
అయితే, సెప్టెంబర్ నెల చివరి నుండి మొదలైన గోల్డ్ మార్కెట్ పతనాన్ని చూస్తే, సెప్టెంబర్ 25 వ తేది వరకూ 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 59,950 వద్ద స్థిరంగా కొనసాగింది. కానీ, సెప్టెంబర్ 26వ తేదీ నుండి మొదలైన గోల్డ్ మార్కెట్ పతనం ఈరోజు వరకూ కూడా కొనసాగుతూ వచ్చింది. మొత్తంగా గడిచిన 15 రోజుల్లో గోల్డ్ రేట్ రూ. 2,700 రూపాయలకు పైగా పతనాన్ని చూసింది.
Note: ఆన్లైన్ మరియు లోకల్ మార్కెట్ గోల్డ్ రేట్ లలో మార్పులు ఉంటాయి.