Gold Rate: ఈరోజు మార్కెట్ లో బంగారం ధర స్వల్పంగా క్రిందకు దిగ్గజారింది. గత వారం మొత్తం మెల్ల మెల్లగా పెరుగుతూ వచ్చిన గోల్డ్ మార్కెట్ ఈరోజు స్వల్పంగా క్రిందకు దిగింది. అయితే, గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న అదే 60 వేల స్లాబ్ పైన కొనసాగుతోంది. కానీ, త్వరలో రానున్న పెద్ద పండుగలైన దసరా మరియు దీపావళి నాటికి గోల్డ్ మార్కెట్ లో మార్పులు జరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల అంచనాలు ఎంతవరకూ నిజమవుతాయో వేచి చూడాలి. మరి ఈరోజు Gold Rate Latest Update ఏమిటో తెలుసుకోండి.
ఈరోజు గోల్డ్ రేట్ లో స్వల్పంగా మార్పులు జరిగాయి. ఈరోజు ఉదయం రూ. 60,320 రూపాయల వద్ద మొదలైన 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ. 160 రూపాయలు క్రిందకు దిగి రూ. 60,160 రూపాయల వద్ద ఈరోజు క్లోజింగ్ ను నమోదు చేసింది. అలాగే, ఈరోజు ఉదయం రూ. 55,300 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ ఆర్నమెంట్ గోల్డ్ రేట్ రూ. 150 రూపాయలు క్రిందకు దిగజారి దిగి రూ. 55,150 రూపాయల వద్ద క్లోజింగ్ ను మార్క్ చేసింది.
Read Also: Big Boss 7 Telugu: బిగ్ బాస్ ను Online లో చూడటానికి తగిన best Smartphones ఇవే.!
గత నెల మొత్తం 60 వేల మార్క్ క్రింద కొనసాగిన గోల్డ్ రేట్, సెప్టెంబర్ నెల ప్రారంభం నుండి 60 వేల మార్క్ పైనే కొనసాగుతోంది. ఈ రేటు ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు మరియు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇవన్నీ కూడా మార్కెట్ ను గమనించే నిపుణుల అంచనాలు మాత్రమే అని గుర్తుంచుకోండి మరియు ఇది పూర్తిగా నిజమని మేము చెప్పటం లేదు.
Read Also: భారీ 24GB RAM తో వచ్చిన ఈ Latest Smartphones గురించి మీకు తెలుసా.!
ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మార్కెట్ ల కంటే చెన్నై మార్కెట్ గరిష్టంగా గోల్డ్ రేట్ ను నమోదు చేసింది. ఈరోజు చెన్నై మార్కెట్ లో ఒక తులం 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర రూ. 60,490 రూపాయల క్లోజింగ్ ను రికార్డ్ చేసింది మరియు ఓక్ తులం 22 క్యారెట్ ఆర్నమెంట్ బంగారం ధర రూ. 55,450 రూపాయల క్లోజింగ్ ను మార్క్ చేసింది.
గమనిక: లోకల్ గోల్డ్ రేట్ మరియు ఆన్లైన్ గోల్డ్ రేట్ లలో మార్పులు ఉంటాయి.