Gold Rate Down: పసిడి ప్రియులకు ఊరట.. ఈరోజు తగ్గిన గోల్డ్ రేట్.!
పసిడి ప్రజలకు ఈరోజు కొంత ఊరట లభించింది
బంగారం ధర ఈరోజు స్వల్పంగా క్రిందకి దిగింది
దారుణంగా పెరిగిపోయిన గోల్డ్ రేట్ కి ఈరోజు అడ్డుకట్ట పడింది
Gold Rate Down: పసిడి ప్రజలకు ఈరోజు కొంత ఊరట లభించింది. ఎందుకంటే, బంగారం ధర ఈరోజు స్వల్పంగా క్రిందకి దిగింది. వారం ప్రారంభం నుండి దారుణంగా పెరిగిపోయిన గోల్డ్ రేట్ కి ఈరోజు అడ్డుకట్ట పడింది. అంతేకాదు, నిన్న ఆల్ టైం గరిష్ట ధరను హిట్ చేసిన గోల్డ్ మార్కెట్ ఈరోజు ఒక్కసారిగా పడిపోయింది.
Gold Rate Down:
మార్చి నెల నుండి ప్రారంభమైన గోల్డ్ జైత్రయాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. మార్చి నెల చివరి నాటికి 67 వేల వద్ద తిరుగాడిన గోల్డ్ రేట్, ఏప్రిల్ నెలలో 70 వేలను దాటి దూసుకు పోయింది. అయితే, ఈరోజు గోల్డ్ సూచీలు కిందకి దిగజారాయి. కానీ, ఇప్పుడు గోల్డ్ రేట్ 70 వేలకు చేరువలోనే కొనసాగుతోంది.
ఈ వారం కూడా బంగారం ధర భారీగానే పెరిగింది మరియు 70 వేల పైన ఆల్ టైం గరిష్ట ధరను కూడా నమోదు చేసింది. ఇక ఈరోజు గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు మార్కెట్ ముగిసే సమయానికి గోల్డ్ రేట్ రూ. 450 రూపాయలకు పైగా క్రిందకు దిగజారింది. ఈరోజు మార్కెట్లో కొనసాగుతున్న 24 క్యారెట్ మరియు 22 క్యారెట్ గోల్డ్ రేట్ లను పరిశీలిద్దాం.
Also Read: కొత్త లుక్ మరియు ఫీచర్స్ తో కొత్త బడ్స్ లాంఛ్ చేస్తున్న Truke బ్రాండ్.!
24 క్యారెట్ గోల్డ్ రేట్
ఈరోజు ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 69,980 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది. ఈరోజు ఉదయం రూ. 70,470 రూపాయల వద్ద మొదలైన 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 490 రూపాయలు క్రిందకు దిగజారింది.
22 క్యారెట్ గోల్డ్ రేట్
ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 64,600 రూపాయల వద్ద క్లోజింగ్ ను సెట్ చేసింది. ఈరోజు ఉదయం రూ. 64,150 రూపాయల వద్ద మొదలై రూ. 450 రూపాయలు క్రిందకు దిగింది.