Gold Rate Down: భారీగా తగ్గిన గోల్డ్ రేట్..లైవ్ అప్డేట్ తెలుసుకోండి.!
పసిడి ప్రియులకు ఊరట కలిగించే వార్త
గడిచిన రెండు రోజులుగా గోల్డ్ మార్కెట్ నష్టాల బాటను పట్టింది
ఈరోజు కూడా గోల్డ్ రేట్ మెల్లమెల్లగా క్రిందకు దిగింది
Gold Rate Down: పసిడి ప్రియులకు ఊరట కలిగించే వార్త ఈరోజు గోల్డ్ మార్కెట్ అందించింది. గడిచిన రెండు రోజులుగా గోల్డ్ మార్కెట్ నష్టాల బాటను పట్టింది. నిన్న మరియు ఈరోజు కూడా గోల్డ్ రేట్ మెల్లమెల్లగా క్రిందకు దిగింది. అంతేకాదు, సంవత్సరం ప్రారంభంతో పోలిస్తే, ప్రస్తుత గోల్డ్ మార్కెట్ తులానికి రూ.700 రూపాయలకు పైగా క్రిందకు దిగింది.
Gold Rate Down
2024 ప్రారంభ రోజున గోల్డ్ మార్కెట్ మంచి రైజులో వుంది మరియు 64 వేల రూపాయల మార్క్ వద్ద గోల్డ్ రేట్ ను లిస్ట్ చేసింది. గత నెల రోజుల మార్కెట్ ను చూస్తే, ఇన్వెస్టర్లకు లాభాల బాటను చూపింది బంగారం ధర. అయితే, గడిచిన రెండు రోజుల నుండి గోల్డ్ మార్కెట్ పసిడి ప్రియులకు ప్రియంగా, మదుపరులకు భారంగా మారింది.
Also Read : 50MP + 50MP + 50MP తో వచ్చిన vivo X100 Pro ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.!
24 క్యారెట్ బంగారం ధర
ఈరోజు గోల్డ్ మార్కెట్ మరియు రేటు వివరాల్లోకి వెళితే, ఈరోజు 10 గ్రా|| 24 క్యారెట్ బంగారం ధర రూ. 63,820 రూపాయల వద్ద నుండి రూ. 63,820 కు పడిపోయింది. అంటే, ఈరోజు 10 గ్రా|| 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 440 రూపాయల నష్టాన్ని చూసింది. అయితే, నిన్న మరియు ఈరోజు కలిపి రెండు రోజుల్లో బంగారం ధర రూ. 710 రూపాయలు క్రిందకు దిగింది.
22 క్యారెట్ బంగారం ధర
ఇక 24 క్యారెట్ బంగారం ధర విషయానికి వస్తే, ఈరోజు 10 గ్రా|| 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 58,500 నుండి రూ. 58,100 రూపాయలకు పడిపోయింది. అంటే, ఈరోజు 10 గ్రా|| 22 క్యారెట్ బంగారం ధర రూ. 400 రూపాయలు క్రిందకు దిగజారింది. గడిచిన రెండు రోజుల్లో 22K గోల్డ్ రేట్ రూ. 650 రూపాయలు పడిపోయింది.