ఈరోజు క్రిందకు దిగిన పసిడి ధర..అప్డేట్ తెలుసుకోండి.!
ఈరోజు పసిడి ధర స్వల్పంగా క్రిందకు దిగింది
నిన్న స్థిరంగా కొనసాగిన గోల్డ్ మార్కెట్
గోల్డ్ మార్కెట్ ఈరోజు స్వల్పంగా క్రిందకు దిగింది
ఈరోజు పసిడి ధర స్వల్పంగా క్రిందకు దిగింది. నిన్న స్థిరంగా కొనసాగిన గోల్డ్ మార్కెట్ ఈరోజు స్వల్పంగా క్రిందకు దిగింది. వాస్తవానికి, గోల్డ్ మార్కెట్ 2023 లో భారీగా పెరిగింది మరియు అదే ట్రెండ్ ను ఫాలో అవుతోంది. కానీ, రోజు వారి మార్కెట్ ను పరిశీలిస్తే మాత్రం పెద్ద మార్పులను కూడా చూడవచ్చు. కానీ, ఈ నెలలో మాత్రం గోల్డ్ రేట్ దాదాపుగా స్థిరంగా కొనసాగుతోంది. ఈరోజు గోల్డ్ మార్కెట్ తో పాటుగా ఈ వారం మరియు ఈ నెలలో గోల్డ్ మార్కెట్ వివరాలను పరిశీలిద్దాం.
ఈరోజు గోల్డ్ మార్కెట్
ఈరోజు గోల్డ్ మార్కెట్ స్వల్పంగా నష్టాన్ని చవి చూసింది. ఈరోజు రూ. 55,950 వద్ద ప్రారంభమైన 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ. 200 నష్టాన్ని చూసి రూ. 55,750 వద్ద ముగిసింది మరియు 24K గోల్డ్ రేట్ కూడా తులానికి రూ. 220 నష్టాన్ని చవి చూసి రూ. 60, 820 వద్ద ముగిసింది.
ఈ వారం పసిడి ధర అప్డేట్
ఈ వారం టోటల్ గోల్డ్ రేట్ ను పరిశీలిస్తే, ఏప్రిల్ 24వ తేదీ సోమవారం రూ. 55,640 వద్ద నిలిచిన ఓక్ తులం 22K గోల్డ్ రేట్ ఈరోజు రూ. 55,750 వద్ద ముగిసింది మరియు రూ. 60,710 వద్ద స్టార్ట్ అయిన పసిడి ధర ఈరోజు రూ. 60,820 వద్ద ముగిసింది. అంటే, ఓవరాల్ గా గోల్డ్ ధర స్థిరంగానే కొనసాగింది.
ఈ నెల గోల్డ్ మార్కెట్ అప్డేట్
ఇక ఈ నెల పసిడి రేట్ ను పరిశీలిస్తే, ఏప్రిల్ 1న రూ. 55,000 మరియు రూ. 60,000 వద్ద ప్రారంభం అయిన 22K మరియు 24K గోల్డ్ మార్కెట్ ప్రస్తుతం రూ. 55,750 మరియు రూ. 60,820 వద్ద కొనసాగుతోంది. అంటే, ఈ నెల గోల్డ్ మార్కెట్ లాభాలను నమోదు చేసినట్లు మనం చూడవచ్చు. ఏప్రిల్ 14న గోల్డ్ మార్కెట్ అధిక రేటును నమోదు చేసింది.
ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్
ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్ వివరాల్లోకి వెళితే, ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ లలో 10గ్రా 22K గోల్డ్ రేట్ రూ. 55,750 వద్ద కొనసాగుతుండగా, 10గ్రా 24K గోల్డ్ రేట్ రూ. 60,820 వద్ద కొనసాగుతోంది.