Gold Rate: ఈరోజు గత 15 రోజులుగా దూకుడు మీదున్న గోల్డ్ రేట్ కు ఈరోజు బ్రేక్ పడింది. గత 15 రోజుల్లో ఆగకుండా సాగుతున్న గోల్డ్ సూచీలు ఇప్పటికే రూ. 4,500 రూపాయలకు పైగా పైకి చేరుకున్నాయి. అయితే, ఈరోజు మార్కెట్ లో గోల్డ్ మర్కెట్ నష్టాలను చూడడంతో గోల్డ్ జైత్రయాత్ర ఆగింది. బంగారం ధర నిన్న 62 వేలకి అతి చెరువులోకి వచ్చి చేరగా, ఈరోజు రేటు క్రిందకు దిగడంతో మళ్ళీ 61 వేల మార్క్ ను చేరుకుంది. ఈరోజు మార్కెట్ లో కొనసాగుతున్న గోల్డ్ రేట్ మరియు లేటెస్ట్ అప్డేట్ పైన ఒక లుక్కేద్దామా.
ఈరోజు మార్కెట్ లో బంగారం ధర స్వల్పంగా నష్టాలను చవిచూసింది. ఉదయం రూ.61,750 రూపాయలవద్ద ప్రారంభమైన ఒక ఒక తులం గోల్డ్ రేట్ రూ. 300 రూపాయల నష్టాన్ని చూసి రూ. 61,450 రూపాయల వద్దకు చేరుకుంది.
ఈరోజు మార్కెట్ లో కొనసాగుతున్న 24 carat బంగారం ధర విషయానికి వస్తే, ఈరోజు రూ.61,750 వద్ద మొదలైన 10 గ్రాముల బంగారం ధర రూ. 300 రూపాయలు క్రిందకు దిగి రూ. 61,450 రూపాయల వద్ద ఈరోజు క్లోజింగ్ ను సెట్ చేసింది.
Also Read : Amazon Sale నుండి భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతున్న QLED Smart Tv డీల్స్.!
ఇక 22 Carat బంగారం ధర విషయానికి వస్తే, రూ. 56,600 రూపాయల వద్ద మొదలైన 10 గ్రాముల 22 carat బంగారం ధర రూ. 56,350 రూపాయల వద్ద ఈరోజు క్లోజింగ్ ను సెట్ చేసింది.
గత వారం vs ఈ వారం గోల్డ్ మార్కెట్ ను పరిశీలిస్తే, గతం వారం ప్రారంభంలో కూడా మొదటి రెండు ఈరోజు, అంటే అక్టోబర్ 16 మరియు అక్టోబర్ 17 తేదీ లలో బంగారం ధర స్వల్పంగా నష్టాలను చూసింది. అయితే, తరువాత పుంజుకున్న గోల్డ్ రేట్ దాదాపుగా రూ. 1,800 వరకూ పెరుగుదలను నమోదు చేసింది.
మరి చూడాలి ఈ వారం బంగారం ధర ఎటువంటి పరిణామాలను చూస్తుందో వేచి చూడాలి. ఎందుకంటే, నిపుణుల మాటల ప్రకారం గోల్డ్ రేట్ 63 వేల మార్క్ ను దాటవచ్చని తెలుస్తోంది. అయితే, ఇది అంచనా మాత్రమే సుమండీ.
గమనిక : ఆన్లైన్ గోల్డ్ రేట్ మరియు లోకల్ మార్కెట్ గోల్డ్ రేట్ లలో ఉంటాయి.