ఈరోజు తగ్గిన పసిడి ధర..ఈరోజు తులం రేటు ఎంతంటే.!
ఇండియన్ మార్కెట్ లో ఈరోజు గోల్డ్ ధర స్వల్పంగా క్రిందకు దిగింది
తులానికి వేల రూపాయల్లో తగ్గింది అని మాత్రం అనుకోకండి
ఈరోజు తులానికి రూ. 310 రూపాయలు మాత్రమే గోల్డ్ రేట్ తగ్గింది
ఇండియన్ మార్కెట్ లో ఈరోజు గోల్డ్ ధర స్వల్పంగా క్రిందకు దిగింది. అయితే, ఇదేదో తులానికి వేల రూపాయల్లో తగ్గింది అని మాత్రం అనుకోకండి. ఈరోజు తులానికి రూ. 310 రూపాయలు మాత్రమే గోల్డ్ రేట్ తగ్గింది. అయితే, గత శనివారం హఠాత్తుగా పెరిగిన బంగారం ధర, నిన్న మరియు ఈరోజు స్వల్పంగా తగ్గింది. లేటెస్ట్ గోల్డ్ రేట్ అప్డేట్ మరియు రేట్ వివరాలను వివరంగా తెలుసుకోండి.
Gold Price:
ఈరోజు గోల్డ్ రేట్ స్వల్పంగా తగ్గింది మరియు ఈరోజు రూ. 61,410 వద్ద ప్రారంభమైన పసిడి రేటు రూ. 61,100 వద్ద ముగిసింది మరియు రూ. 56,290 వద్ద ప్రారంభమైన పసిడి ధర రూ. 56,000 వద్ద ముగిసింది. అంటే, ఈరోజు గోల్డ్ మార్కెట్ స్వల్పంగా క్రిందకు దిగింది.
మార్కెట్ లో గోల్డ్ ధరలు:
ఈరోజు దేశవ్యాపంగా ఉన్న ప్రధాన మార్కెట్ లలో గోల్డ్ ధరల వివరాల్లోకి వెళితే, ఈరోజు విశాఖపట్టణం, విజయవాడ మరియు హైదరాబాద్ మార్కెట్ లలో రూ. 61,410 వద్ద 10 గ్రాముల 24K స్వచ్ఛమైన బంగారం ధర ఉండగా, 10 గ్రాముల 22K గోల్డ్ రేట్ రూ. 56,410 రూపాయల వద్ద కొనసాగుతోంది.
ఇక ఈ నెల ఇప్పటికి వరకూ సాగిన గోల్డ్ మర్కెట్ ప్రయాణం చూస్తే, ఈ నెల ప్రారంభంలో ఒక తులం 24K గోల్డ్ రేట్ రూ. 60,760 వద్ద మొదలై ప్రస్తుతం రూ. 61,410 వద్ద కొనసాగుతోంది. అయితే, ఈ నెలలో మే 5వ తేదీ గోల్డ్ మార్కెట్ హైఎస్ట్ రేట్ ను చూసింది. మే 5న 10 గ్రాముల 24 క్యారెట్ పసిడి ధర రూ. 62,400 గా నమోదయ్యింది.
గమనిక: ఆన్లైన్ మరియు లోకల్ మార్కెట్ గోల్డ్ రేట్ లలో మార్పులు ఉన్నాయి.