Gold Rate Down: నెల రోజుల కనిష్ఠానికి చేరుకున్న గోల్డ్ మార్కెట్.!
గత రెండు రోజులుగా క్రిందకు దిగిన బంగారం ధర
బంగారం ధర నెల రోజుల కనిష్ఠాన్ని నమోదు చేసింది
ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తోంది గోల్డ్ మార్కెట్
Gold Rate Down: గత రెండు రోజులుగా క్రిందకు దిగిన బంగారం ధర, ఈరోజు కూడా అదే దారిలో కొనసాగింది. మార్కెట్ లో ఈరోజు బంగారం ధర నష్టాలను నమోదు చెయ్యడంతో బంగారం ధర నెల రోజుల కనిష్ఠాన్ని నమోదు చేసింది. ఇప్పటికే గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తోంది గోల్డ్ మార్కెట్. మరి ఈరోజు మార్కెట్ లో బంగారం ధర మరియు ఈ వారం గోల్డ్ రేట్ అప్డేట్ తెలుసుకుందామా.
Gold Rate Down
ఈరోజు బంగారం ధర నెల రోజుల కనిష్ఠాన్ని నమోదు చేసింది. ఈరోజు రూ. 62,950 రూపాయల వద్ద మొదలైన బంగారం ధర రూ. 330 రూపాయల నష్టాన్ని చూసి రూ. 62,620 రూపాయల వద్ద క్లోజింగ్ ను చూసింది.
ఈ వారం గోల్డ్ మార్కెట్ రూ. 63,440 రూపాయల వద్ద ప్రారంభమయ్యింది. అయితే, మంగళవారం నుండి బంగారం ధర నష్టాలను చూడటం మొదలు పెట్టింది. జనవరి 16వ తేదీ నుండి జనవరి 18 వరకూ గోల్డ్ రేట్ రూ. 820 రూపాయల నష్టాన్ని చూసి రూ. 62,620 వద్ద క్లోజ్ అయ్యింది.
Also Read : Amazon Sale నుండి భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతున్న 5.1 Soundbar డీల్స్ ఇవే.!
24 క్యారెట్ గోల్డ్ రేట్ అప్డేట్
ఈరోజు 24 క్యారెట్ గోల్డ్ అప్డేట్ లోకి వెళితే, ఈరోజు రూ. 62,950 రూపాయల వద్ద మొదలైన10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 62,620 రూపాయల వద్ద క్లోజింగ్ ను చూసింది. అంటే, ఈరోజు ఒక తులం గోల్డ్ రేట్ రూ. 330 రూపాయలు క్రిందకు దిగజారింది.
22 క్యారెట్ గోల్డ్ రేట్ అప్డేట్
ఇక ఈరోజు కొనసాగిన 22 క్యారెట్ గోల్డ్ రేట్ అప్డేట్ ను పరిశీలిస్తే, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 57,700 రూపాయల వద్ద ప్రారంభమై రూ. 300 రూపాయలు క్రిందకు దిగి రూ. 57,400 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.