Gold Rate Down: గత నెల మొత్తం స్థిరంగా కొనసాగిన బంగారం ధర ఈ నెలలో మాత్రం భారీగా తగ్గింది. వాస్తవానికి, ఫిబ్రవరి మొదటి వారం మొత్తం కూడా 63 వేల రూపాయల వద్ద స్థిరంగా నడిచింది గోల్డ్ మార్కెట్. కానీ, ఈ వారం మాత్రం గోల్డ్ మార్కెట్ మళ్ళీ నేల చూపులు చూస్తోంది. గత వారం చివరిలో తులానికి రూ. 300 రూపాయల వరకూ తగ్గినా బంగారం ధర, ఈరోజు మాత్రం భారీగా నష్టాలను చూసింది.
గోల్డ్ మార్కెట్ ఈరోజు భారీగా నష్టాలను చూసింది. ఈరోజు ఉదయం మార్కెట్ లో రూ. 62,840 రూపాయల వద్ద ప్రారంభమైన బంగారం ధర తులానికి రూ. 660 రూపాయల భారీ నష్టాన్ని చూసింది. అందుకే, గోల్డ్ మార్కెట్ రూ. 62,180 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది. ఇక గడిచిన 10 రోజుల గోల్డ్ మార్కెట్ వివరాల్లోకి వెళితే, ఫిబ్రవరి 5వ తేదీ గోల్డ్ మార్కెట్ రూ. 63,220 రూపాయల వద్ద కొనసాగింది. ఈరోజు 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 62,180 రూపాయల వద్ద కొనసాగుతోంది.
Also Read: JIo Offer: ఈ ప్లాన్ తో ఉచిత Prime Video మరియు అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి.!
అంటే, గడిచిన 10 రోజుల్లో గోల్డ్ మార్కెట్ తులానికి రూ. 1,040 రూప్యాలు పతనమయ్యింది. అంతేకాదు, ఈరోజు గోల్డ్ మార్కెట్ 6 నెలల కనిష్ఠాన్ని కూడా చూసింది. గోల్డ్ మార్కెట్ లో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన షేర్ హోల్డర్స్ కి ఇది చేదు వార్తే అవుతుంది. గోల్డ్ రేట్ పడిపోవడం అనేది గోల్డ్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చెయ్యాలని చూస్తున్న వారికి మరియు గోల్డ్ కొనాలని చూస్తున్న పసిడి ప్రియులకు శుభవార్తే అవుతుంది.
ఇక ఈరోజు కొనసాగుతున్న 24 క్యారెట్ గోల్డ్ రేట్ వివరాల్లోకి వెళితే, ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ. 62, 180 రూపాయల వద్ద కొనసాగుతోంది.
ఇక 22 క్యారెట్ గోల్డ్ రేట్ విషయానికి వస్తే, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 57,600 రూపాయల వద్ద ప్రారంభమై రూ. 600 రూపాయలు క్రిందకు దిగి రూ. 57,000 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.