ఈరోజు కూడా Gold మార్కెట్ డౌన్.. ఎంత తగ్గిందంటే.!

Updated on 20-Oct-2022
HIGHLIGHTS

ఈరోజు కూడా Gold మార్కెట్ డౌన్ ట్రేడింగ్ నే ఫాలో అయ్యింది

ప్రస్తుతం మార్కెట్ లో బంగారం ధర ఆశాజనకంగానే వుంది

బంగారం ధరలో మార్పులు జరిగే అవకాశం ఉండొచ్చేమో అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి

ఈరోజు కూడా Gold మార్కెట్ డౌన్ ట్రేడింగ్ నే ఫాలో అయ్యింది. ఇప్పటికే ఈ నెల ప్రారంభం నుండి ఈరోజు వరకూ లెక్కిస్తే దాదాపుగా గ్రాముకు 190 రూపాయలకు పైగా బంగారం ధర తగ్గింది. అంటే, ప్రస్తుతం మార్కెట్ లో బంగారం ధర ఆశాజనకంగానే వుంది. అయితే, దీపావళి పండుగ నాటికి బంగారం ధరలో మార్పులు జరిగే అవకాశం ఉండొచ్చేమో అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే, రానున్న ధన త్రయోదశి (దంతేరస్) సందర్భంగా గోల్డ్ కొనుగోలుకు ప్రజలు మక్కువ చూపడమే కారణంగా చెబుతున్నారు. ఈరోజు మార్కెట్ లో గోల్డ్ రేట్ ఎలా కొనసాగుతోందో చూద్దామా.             

Gold Rate:

నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,550 రూపాయలుగా ఉండగా, ఈరోజు కొంచెం తగ్గిన గోల్డ్ మార్కెట్ 46,350 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.50,560 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,350 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,560 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,360 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,570 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,350 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.50,560 గా ఉంది. ఈరోజు కూడా   దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,110 గా ఉంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :