Gold Rate Down: ఈ వారంలో వరుసగా మూడవ రోజు కూడా బంగారం ధర క్రిందకు దిగజారింది. అంతేకాదు, గత కొన్ని రోజులుగా 60 వేల రూపాయల మార్క్ ఎగువన కొనసాగుతున్న గోల్ మార్కెట్ ఈరోజు 60 వేల దిగువకు చేరుకుంది. అయితే, ఆగష్టు చివరిలో గోల్డ్ మార్కెట్ నమోదు చేసిన డౌన్ ఫాల్ రేట్ లో ఇప్పుడు గోల్డ్ రేట్ ఉన్నట్లు మనం చూడవచ్చు. Gold Latest Price మరియు మూడు రోజుల Gold Rate Down వివరాలతో పాటుగా మార్కెట్ అప్డేట్ ను కూడా చూద్దాం పదండి.
ముందుగా ఈరోజు మార్కెట్ లో వున్నా Gold Latest Price వివరాల్లోకి వెళితే, ఈరోజు ఉదయం రూ. 60,000 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర తులానికి రూ. 110 రూపాయలు క్రిందకు దిగి రూ. 59,890 రూపాయల క్లోజింగ్ ను నమోదు చేసింది. అలాగే, ఈరోజు రూ. 55,000 రూపాయల వద్ద మొదలైన 10 గ్రాముల 22K ఆర్నమెంట్ బంగారం ధర 100 రూపాయలు క్రిందకు దిగజారి రూ. 54,900 రూపాయల వద్ద క్లోజ్ అయ్యింది.
Also Read: Moto G84 5G Sale: భారీ అఫర్ తో మోటో బడ్జెట్ 12GB RAM ఫోన్ First Sale.!
ఇక Gold Rate Down వివరాలికి వెళితే గడిచిన మూడు ఈరోజుల్లో గోల్డ్ రేట్ తులానికి దాదాపుగా రూ. 500 రూపాయల వరకూ పడిపోయింది. ఇక గత వారంతో పోలిస్తే ఈవారం గోల్డ్ ధర క్రిందకు దిగజారింది మరియు 10 రోజుల కనిష్ఠాన్ని ఈరోజు నమోదు చేసింది. అయితే, చెన్నై మార్కెట్ లో ఈరోజు కూడా గోల్డ్ రేట్ 60 వేల మార్క్ పైనే కొనసాగుతోంది.
గోల్డ్ రేట్ ఇటీవల కాలంలో దాదాపుగా 60 వేల మార్క్ నే అంటిపెట్టుకొని తిరుగుతోంది. మరి రానున్న రోజుల్లో గోల్డ్ మార్కెట్ ఎలా కొసాగుతుందో వేచిచూడాలి.
గమనిక: ఆన్లైన్ గోల్డ్ మార్కెట్ ధరలకు లోకల్ మార్కెట్ లో గోల్డ్ రేట్ లకు వ్యత్యాసాలు ఉంటాయని గమనించాలి.
Also Read: Aditya-L1 Selfie: అంతరిక్షం నుండి భూమి మరియు చంద్రుని Selfie Video పంపింది.!