Gold Rate: క్రిందకు దిగుతున్న బంగారం ధర..!

Gold Rate: క్రిందకు దిగుతున్న బంగారం ధర..!
HIGHLIGHTS

బంగారం ధర గత మూడు రోజులుగా మెల్ల మెల్లగా క్రిందకు దిగుతోంది

గోల్డ్ ధర ఇప్పటికి దాదాపుగా ప్రియంగానే కనిపిస్తోంది

గత వారం తులానికి 60 వేలకు పైగా రేటును నమోదు చేసిన గోల్డ్ మార్కెట్

బంగారం ధర గత మూడు రోజులుగా మెల్ల మెల్లగా క్రిందకు దిగుతోంది. ఈనెలలో భారీగా పెరిగి గోల్డ్ ధర ఇప్పటికి దాదాపుగా ప్రియంగానే కనిపిస్తోంది. అయితే, గత్ వారం పోలిస్తే మాత్రం ప్రస్తుతం గోల్డ్ మార్కెట్ కొంత ఆశాజనకంగానే కనిపిస్తోంది. ఎందుకంటే, గత వారం తులానికి 60 వేలకు పైగా రేటును నమోదు చేసిన గోల్డ్ మార్కెట్, ప్రస్తుతం ఈ మూడు రోజుల్లో తులానికి 540 రూపాయలకు పైగా క్రిందకు దిగింది. ఈరోజు బంగారం ధర ఎలా ఉన్నదో చూద్దామా. 

Gold update:

ఈరోజు ప్రధాన మార్కెట్ లో రూ.54,710 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.210 రూపాయలు క్రిందకు దిగి రూ.54,500 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, రూ.59,690 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర ఈరోజు రూ.59,450 రూపాయల వద్ద కొనసాగుతోంది. అంటే, ఈరోజు కూడా బంగారం ధర రూ.240 రూపాయలు క్రిందకు  దిగినట్లు మనం చూడవచ్చు.

ఈరోజు బంగారం ధర

తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలో ఈరోజు బంగారం ధర చూస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,500 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,600 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,500 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,600 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,650 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.59,600 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,100 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,110 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo