Gold Rate: గత వారం హైయెస్ట్ రేట్ నమోదు చేసిన గోల్డ్ మార్కెట్ ఈ వారం ప్రారంభమవుతూనే నష్టాలతో ముగిస్తుంది. ఈరోజు ఉదయం హైయెస్ట్ రేటు వద్ద ప్రారంభమైన గోల్డ్ మార్కెట్, మార్కెట్ ముగిసే సమయానికి నష్టాలను చవి చూసింది. అయితే గోల్డ్ రేట్ నష్టాలను చూడటం పసిడి ప్రియులకు ఈ శుభవార్త అవుతుంది. కానీ, గోల్డ్ మార్కెట్ స్వల్పంగా మాత్రమే నష్టాలను చూసింది.
ఈరోజు గోల్డ్ మార్కెట్ వివరాల్లోకి వెళితే, ఈరోజు గోల్డ్ మార్కెట్ తులానికి 200 రూపాయలకు పైగా నష్టాన్ని చూసింది. అందుకే గోల్డ్ మార్కెట్ ఈరోజు 66 వేల మార్కును వదిలి పెట్టి 65 వేల మార్కును చేరుకుంది.
గతవారం కూడా గోల్డ్ మార్కెట్ ఒక దశలో 65 వేల మార్క్ ని తాకింది. కానీ, వారాంతానికి మళ్ళీ తిరిగి పుంజుకొని 66 వేల మార్కును చేరుకుంది. అయితే, ఈరోజు గోల్డ్ మార్కెట్ మళ్ళా తిరిగి నష్టాలను చూసి 55 వేల మార్క్ కు తిరిగి చేరుకుంది.
Also Read: Motorola Edge 50 Pro: సూపర్ కెమేరా మరియు 3D Curved డిస్ప్లేతో వస్తోంది.!
ఈరోజు 24 క్యారెట్ గోల్డ్ రేట్ విషయానికి వస్తే, ఈరోజు మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ. 230 రూపాయల నష్టాన్ని చూసి రూ. 65,870 వద్ద క్లోజింగ్ నమోదు చేసింది. నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 66,100 వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.
ఇక ఈరోజు కొనసాగుతున్న 22 క్యారెట్ గోల్డ్ రేట్ ను చూస్తే, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 60,380 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది. ఉదయం రూ. 60, 590 రూపాయల వద్ద ప్రారంభమైన గోల్డ్ రేట్ తులానికి రూ. 210 రూపాయల నష్టాన్ని చూసి ఈ రేటు వద్ద క్లోజింగ్ ని నమోదు చేసింది.