Gold Rate Down: నిన్న మరియు ఈరోజు భారీగా పడిపోయిన గోల్ మార్కెట్ |New Price
నిన్న మరియు ఈరోజు భారీగా పడిపోయిన గోల్ మార్కెట్
భారీగా పెరుగుతూ వచ్చిన గోల్డ్ రేట్ ఎట్టకేలకు పడిపోయింది
బంగారం ధర ఇప్పుడు మళ్ళీ 61 వేల క్రిందకు దిగజారింది
Gold Rate Down: నిన్న మరియు ఈరోజు భారీగా పడిపోయిన గోల్ మార్కెట్. ఈ నెల ప్రారంభం నుండి భారీగా పెరుగుతూ వచ్చిన గోల్డ్ రేట్ ఎట్టకేలకు పడిపోయింది. అక్టోబర్ 7వ్ తేదీ నుండి గోల్డ్ మార్కెట్ సూచీలు పైకి ఎగబాకడం మొదలుపెట్టగా, ప్రస్తుతం వాటికీ బ్రేకులు పడ్డాయి. శనివారం నాటికి 62 వేల రూపాయల పైన కొనసాగిన బంగారం ధర ఇప్పుడు మళ్ళీ 61 వేల క్రిందకు దిగజారింది. ప్రసుతం గోల్డ్ రేట్ మరియు గోల్డ్ మార్కెట్ అప్డేట్ లతో పాటు ఈ నెల గోల్డ్ మార్కెట్ ప్రయాణం పైన ఒక లుక్కేద్దాం.
Gold Rate Down:
దేశవ్యాప్తంగా ఈరోజు గోల్డ్ రేట్ నష్టాలను నమోదు చేసింది మరియు తులానికి రూ. 550 రూపాయలు క్రిందకు దిగింది. నిన్న మార్కెట్ లో బంగారం ధర 62 వేల మార్క్ పైన నడుస్తుండగా, ఈరోజు దెబ్బకి 61 వేల దిగువకు చేరుకుంది.
Todays Gold Rate
ఇక ఈరోజు గోల్డ్ రేట్ వివరాల్లోకి వెళితే, ఈరోజు రూ. 62,400 రూపాయల వద్ద మొదలైన 24 క్యారట్ గోల్డ్ రేట్ ఈరోజు రూ. 550 రూపాయలు క్రిందకు దిగజారి రూ. 61,850 రూపాయల వద్ద స్థిరపడింది.
అలాగే, ఈరోజు రూ. 57,200 రూపాయల వద్ద ప్రారంభమైన 22 క్యారట్ గోల్డ్ రేట్ ఈరోజు రూ. 500 రూపాయలు క్రిందకు దిగి రూ. 56,700 రూపాయల వద్ద ఈరోజు క్లోజింగ్ ను నమోదు చేసింది.
Also Read : Dark Web: దాదాపుగా 81 కోట్ల భారతీయుల డేటా లీక్ |Tech News
అక్టోబర్ 2023 గోల్ మార్కెట్
అక్టోబర్ 2023 గోల్ మార్కెట్ విషయానికి వస్తే, అక్టోబర్ 1న గోల్డ్ మార్కెట్ రూ. 58,200 రూపాయల వద్ద స్టార్ట్ అయ్యింది మరియు రోజు రోజుకు నష్టాలను చూసి అక్టోబర్ 5వ తేదీ నాటికీ రూ. 57,160 రూపాయల కనిష్ఠానికి పడిపోయింది. అయితే, అక్టోబర్ 7 నుండి గోల్డ్ మార్కెట్ తిరిగి లాభాల బాటను పట్టిన గోల్డ్ మార్కెట్ అక్టోబర్ 29వ తేదీ రూ. 62,630 రూపాయల గరిష్టాన్ని నమోదు చేసింది.
అయితే, నెల చివరి రోజులైన అక్టోబర్ 30 మరియు 31వ తేదీలలో గోల్డ్ రేట్ నష్టాలను చూడడంతో ఈరోజు రూ. 61,850 వద్ద ఈ నెల క్లోజింగ్ ను నమోదు చేసింది.