భారిగా తగ్గిన బంగారం ధర..ఈరోజు క్లోజింగ్ రేట్ ఎంతంటే.!
ఈ వారం మొత్తం మీద బంగారం ధర భారీ గానే తగ్గింది
పూర్తిగా వారం మొత్తం అదే ట్రెండ్ ను ఫాలో అయ్యింది
గోల్డ్ రేట్ క్రిందకు దిగడం ఆశ్చర్య పరుస్తోంది
ఈ వారం మొత్తం మీద బంగారం ధర భారీ గానే తగ్గింది. వారం ప్రారంభం లో మొదలైన గోల్డ్ రేట్ డిప్, పూర్తిగా వారం మొత్తం అదే ట్రెండ్ ను ఫాలో అయ్యింది. వారం మొత్తం మీద దాదాపుగా 1,000 రూపాయల వరకు క్రిందకు దిగింది. వాస్తవానికి, గోల్డ్ రేట్ పెరుగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తుండగా గోల్డ్ రేట్ క్రిందకు దిగడం ఆశ్చర్య పరుస్తోంది. ఈరోజు వారం మరియు ఈరోజు గోల్డ్ రేట్ వివరాలు తెలుసుకోండి.
Gold Rate Live
ఈవారం గోల్డ్ రేట్ వివరాలను పరిశీలిస్తే, ఈ వారం ప్రారంభంలో గోల్డ్ రేట్ రూ. 61,420 రూపాయల వద్ద మొదలై ఈరోజు రూ. 60,600 వద్ద ముగిసింది. అంటే, ఈ వారం మొత్తం మీద గోల్డ్ రేట్ రూ. 820 రూపాయలు క్రిందకు దిగింది. ఇది 10 గ్రాముల స్వచ్ఛమైన 24K గోల్డ్ రేట్ కాగా, 22K గోల్డ్ రేట్ రూ. 56,300 వద్ద మొదలై ఈరోజు రూ.55,550 వద్ద ముగిసింది. ఓవరాల్ గా ఈ వారం మొత్తంగా గోల్డ్ రేట్ క్రిందకు దిగడమే చూడవచ్చు.
Today Gold Rate
ఈరోజు ప్రధాన మార్కెట్ లో 10 గ్రాముల 24K పసిడి రూ. రూ. 60,600 వద్ద ముగియగా 22K పసిడి ధర రూ. 55,550 రూపాయల ధారా వద్ద ముగిసింది. ఈ రేటు హైదరాబాద్, విజయవాడ మరియు వైజాగ్ వంటి తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలలో కొనసాగుతుంది.