నష్టాల్లో గోల్డ్ మార్కెట్..రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే.!

Updated on 29-May-2023
HIGHLIGHTS

నిన్న మొదలైన గోల్డ్ మార్కెట్ నష్టాల బాట ఈరోజు కూడా కొనసాగుతోంది

రూ. 700 రూపాయలకు పైగా గోల్డ్ రేట్ క్రిందకు దిగింది

గోల్డ్ రేట్ లైవ్ అప్డేట్ ను చూడండి

నిన్న మొదలైన గోల్డ్ మార్కెట్ నష్టాల బాట ఈరోజు కూడా కొనసాగుతోంది. గత వారం మొత్తం పెరుగుతూ వచ్చిన పసిడి ధర, నిన్నటి నుండి క్రిందకు జారడం మొదలు పెట్టింది. నిన్న మార్కెట్ లో గోల్డ్ రేట్ తులానికి 490 రూపాయలు నష్టాన్ని చూడగా, ఈరోజు కూడా తులానికి 220 రూపాయల నష్టాన్ని చూసి ప్రస్తుతం రూ. 61,200 రూపాయల ధర వద్ద కొసాగుతోంది. ఈ రెండు రోజుల్లో గోల్డ్ మార్కెట్ మొత్తంగా తులానికి రూ. 700 రూపాయలకు పైగా గోల్డ్ రేట్ క్రిందకు దిగింది. ఈ రెండు రోజుల మార్కెట్ మరియు రేట్ అప్డేట్ వివరాలను పరిశీలిద్దామా. 

Gold Rate:

నిన్న మార్కెట్ లో 24క్యారెట్ గోల్డ్ (10 గ్రా) రూ. 61,200 వద్ద ప్రారంభమై రూ. 61,420 వద్ద ముగియగా, ఈరోజు రూ 61,420 వద్ద ప్రారంభమై రూ. 61,200 వద్ద ముగిసింది. అంటే, రెండు రోజులు కూడా గోల్డ్ మార్కెట్ నష్టాలను చవి చూసి, 61 వేల మార్క్ ను తిరిగి చేరుకుంది. అలాగే, 22K ఆర్నమెంట్ బంగారం కూడా రెండు రోజుల్లో రూ. 650 రూపాయల నష్టాన్ని చూసి రూ. 56,100 వద్ద కొనసాగుతోంది. 

పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధర తగ్గడం పసిడి ప్రియులకు కొంత ఊరట నిచ్చింది. అయితే, నిలకడ లేని గోల్డ్ మార్కెట్ ట్రెండ్ చూస్తుంటే మాత్రం ఇది ఎక్కువ రోజులు రిపీట్ అయ్యే ఛాన్స్ తక్కువనే చెప్పొచ్చు. 

ఈరోజు ప్రధాన నగరాల్లో పసిడి ధర

ఈరోజు దేశంలోని ప్రధాన మార్కెట్ లలోని గోల్డ్ ప్రైస్ వివరాల్లోకి వెళితే, ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన మార్కెట్ లలో ఈరోజు ఒక తులం (10గ్రా) 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 61,200 రూపాయల వద్ద కొసాగుతోంది మరియు 22K (10గ్రా) గోల్డ్ రేట్ రూ. 56,100 వద్ద కొనసాగుతోంది. 

ఈరోజు కూడా చెన్నై మార్కెట్ లో పసిడి ధర స్వల్పంగా అధిక ధరలో కొనసాగుతోంది. ఈరోజు చెన్నై మార్కెట్ లో 10గ్రాముల 24K బంగారం ధర రూ. 61,640 వద్ద ఉండగా, 10 గ్రాముల 22K బంగారం ధర రూ. 56,500 రూపాయలుగా నమోదు చేసింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :