జూన్ నెల ప్రారంభం నుండి మొదలైన రేట్ పతనం ఇంకా కొనసాగుతోంది. ఈ వారం ప్రారంభం నుండి కూడా పడిపోతూ వస్తున్న గోల్డ్ రేట్ ఈరోజు మరింత క్రిందకు దిగజారింది. అంతేకాదు, ఈరోజు ఈ మూడు నెలల్లో ఎన్నడూ చూడనంత తక్కువ రేటును నమోదు చేసింది. కేవలం ఈ మూడు రోజుల్లోనే గోల్డ్ రేట్ 600 రూపాయల వరకూ క్రిందకు దిగింది మరియు ప్రస్తుతం డౌన్ ఫాల్ ట్రెండ్ ను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. మరి ఈరోజు గోల్డ్ రేట్ మరియు లేటెస్ట్ గోల్డ్ రేట్ అప్డేట్ వివరాలు చూద్దామా.
ఈరోజు (జూన్ 22) గోల్డ్ రేట్ అప్డేట్ లోకి వెళితే, ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ. 59,670 వద్ద ప్రారంభమై 220 రూపాయలు క్రిందకు దిగి రూ. 59,450 వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది. అలాగే, 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ. 54,700 రూపాయల వద్ద మొదలై రూ. 200 క్రిందకు దిగి రూ. 54,500 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.
ఈరోజు తెలుగు రాష్ట్రాలలో బంగారం రేటు ఎలా ఉందని చూస్తే, ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఒక 10 గ్రాముల 24K స్వచ్ఛమైన బంగారం ధర రూ. 59,450 గా ఉండగా 10 గ్రాముల 22K బంగారం ధర రూ. 54,500 గా వుంది. ఈరోజు మూడు నెలల కనిష్ఠ రేటును ను గోల్డ్ మార్కెట్ చూసింది.
గమనిక: ఆన్లైన్ గోల్డ్ రేట్ మరియు లోకల్ గోల్డ్ రేట్ లలో మార్పులు ఉంటాయని గమనించాలి.