రోజు రోజుకి పడిపోతున్న బంగారం ధర.. ఈరోజు రేటు ఎంతంటే..!!

రోజు రోజుకి పడిపోతున్న బంగారం ధర.. ఈరోజు రేటు ఎంతంటే..!!
HIGHLIGHTS

ఈరోజు కూడా మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా పడిపోయింది

గత వారం నుండి రోజు రోజుకి పడిపోతున్న బంగారం ధర

ఈ వారం కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందేమో అని అనిపిస్తోంది

ఈరోజు కూడా మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా పడిపోయింది. అయితే, గత వారం నుండి రోజు రోజుకి పడిపోతున్న బంగారం ధర చూస్తుంటే ఈ వారం కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందేమో అని అనిపిస్తోంది. అయితే, గోల్డ్ మార్కెట్ ను ఊహించడం కొంచెం కష్టమే. ఇక ఈరోజు గోల్డ్ రేట్ పరిశీలిస్తే, ఈరోజు కూడా గోల్డ్ రేట్ సూచీలు స్వల్పంగా క్రిందకు దిగాయి. మరి ఈరోజు దేశ రాజధానితో సహా మన తెలుగు రాష్టాల్లో బంగారం ధర వివరాలను తెలుసుకుందామా.

నిన్న10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,810 రూపాయలుగా ఉండగా, ఈరోజు 200 రూపాయలు తగ్గి 47,610 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు తులానికి 210 రూపాయలు తగ్గి రూ.51,920 వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,610 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,930 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,610 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,930 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,610 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,930 గా ఉంది. ఈరోజు కూడా    దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,140 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,520 గా ఉంది.

ప్రతి రోజు Gold Live అప్డేట్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo