Gold Price: ఈరోజు దారుణంగా పడిపోయిన బంగారం ధర.!

Updated on 01-Sep-2022
HIGHLIGHTS

ఈరోజు దేశవ్యాప్తంగా బంగారం ధర దారుణంగా పడిపోయింది

ఈరోజు బంగారం ధర ఏడు నెలల కనిష్ఠాన్ని నమోదు చేసింది

తులానికి 900 రూపాయలకు పైగా బంగారం ధర పడిపోయింది

ఈరోజు దేశవ్యాప్తంగా బంగారం ధర దారుణంగా పడిపోయింది. వారం ప్రారంభం నుండి పతమవుతూ వచ్చిన బంగారం ధర, ఈరోజు దారుణంగా పతనమయ్యింది. అంతేకాదు, ఈరోజు బంగారం ధర ఏడు నెలల కనిష్ఠాన్ని నమోదు చేసింది. ఇక ఈరోజు మార్కెట్ పరిశీలిస్తే, బంగారం ధర తులానికి 530 రూపాయల వరకూ  పడిపోయింది. ఇక ఈ వారం ప్రారంభ ధరతో పోలిస్తే ఈరోజు వరకూ తులానికి 900 రూపాయలకు పైగా బంగారం ధర పడిపోయింది. మరి ఈరోజు తెలుగు రాష్టాల ప్రధాన నగరాలు మరియు దేశ రాజధానిలో బంగారం ధర ఎలా ఉన్నదో చూద్దామా.

నిన్న10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,000 రూపాయలుగా ఉండగా, ఈరోజు 46,500 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.50,730 వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,500 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,730 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,500 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,730 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,500 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,730 గా ఉంది. ఈరోజు కూడా    దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,100 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,380 గా ఉంది.

ప్రతి రోజు Gold Live అప్డేట్స్ కోసం Click Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :