Gold: ఈరోజు కూడా తగ్గిన బంగారం ధర..!

Gold: ఈరోజు కూడా తగ్గిన బంగారం ధర..!
HIGHLIGHTS

ఈ వారం మొత్తం గోల్డ్ రేట్ డౌన్ ట్రేడ్ లో నడుస్తోంది

ఈరోజు కూడా బంగారం ధర స్వల్పంగా తగ్గింది

ఈరోజు దేశ రాజధానితో సహా తెలుగు రాష్టాల్లో గోల్డ్ రేట్ వివరాలు

ఈ వారం మొత్తం గోల్డ్ రేట్ డౌన్ ట్రేడ్ లో నడుస్తోంది. ఇదే బాటలో ఈరోజు కూడా బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఈరోజు మార్కెట్ ప్రారంభమవుతూనే బంగారం సూచీలు తటస్తంగా నిలిచినా, మెల్లగా క్రిందకు దిగజారింది. కానీ, గత నెలతో పోలిస్తే ఇప్పటికి కూడా గోల్డ్ రేట్ ఇప్పటికి అధికంగానే వుంది. ఇక ఈరోజు దేశ రాజధానితో సహా ఈరోజు తెలుగు రాష్టాల్లో గోల్డ్ రేట్ వివరాలను పరిశీలిద్దాం.

నిన్న10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,850 రూపాయలుగా ఉండగా, ఈరోజు 40 రూపాయలు తగ్గి 47,750 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు తులానికి 100 రూపాయలు తగ్గి రూ.52,090 వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,090 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,090 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,090 గా ఉంది. ఈరోజు కూడా    దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,230 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,610 గా ఉంది.

ప్రతి రోజు Gold Live అప్డేట్స్ కోసం Click Here   

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo