Gold Rate: మార్కెట్ లో స్థిరంగా గోల్డ్ రేట్..ఈరోజు అప్డేట్ ఇదే.!

Updated on 19-Oct-2022
HIGHLIGHTS

మార్కెట్ లో బంగారం ధరలో పెద్దగా మార్పులు కూడా కనిపించడం లేదు

బంగారం ధర కొనుగోలుదారులకు అనుకూలంగానే ఉండడం విశేషం

ప్రస్తుతానికి మాత్రం గోల్డ్ స్థిరంగానే కొనసాగుతోంది

ప్రస్తుతం మార్కెట్ లో బంగారం ధర దాదాపుగా 50 వేల రూపాయల రేటును అంటిపెట్టుకుని కొనసాగుతోంది. మార్కెట్ లో బంగారం ధరలో పెద్దగా మార్పులు కూడా కనిపించడం లేదు. అయితే, ప్రస్తుతం బంగారం ధర కొనుగోలుదారులకు అనుకూలంగానే ఉండడం విశేషం. దీపావళి పండుగ నాటికి గోల్డ్ రేట్ తో లో మార్పులు జరిగే అవకాశం ఉండొచ్చేమో అని మార్కెట్ వర్గాలు చెబుతున్నా, ప్రస్తుతానికి మాత్రం గోల్డ్ స్థిరంగానే కొనసాగుతోంది. మరి ఈరోజు దేశంలో గోల్డ్ రేట్ ఎలా కొనసాగుతోందో చూద్దామా.              

Gold Rate:

నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,420 రూపాయలుగా ఉండగా, ఈరోజు కూడా స్థిరంగా నిలబడిన గోల్డ్ మార్కెట్ 46,450 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.50,780 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,450 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,670 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,460 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,780 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,420 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.50,670 గా ఉంది. ఈరోజు కూడా   దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,270 గా ఉంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :