Gold Price Update: మే నెల ప్రారంభం నుండి గోల్డ్ రేట్ లో పెద్ద మార్పులే చోటు చేసుకున్నాయి. ఏప్రిల్ నెల మొత్తం భారీ లాభాలను చూసిన గోల్డ్ మార్కెట్, మే నెలలో మాత్రం ప్రారంభం నుండి నష్టాలనే చూసింది. మే 1వ తేదీ ఒక్కసారిగా కిందకు దిగి చతికిలబడిన గోల్డ్ మార్కెట్, ఈరోజు స్వల్పంగా తిరిగి 72, వేల మార్కును చేరుకుంది.
మే 1వ తారీకు నుంచి మార్కెట్ లో కొనసాగిన గోల్డ్ రేటు విషయానికి వస్తే, ఒకటో తేదీ గోల్డ్ మార్కెట్ 72 వేల మార్క్ వద్ద మొదలయ్యింది. అయితే, నెల మొదటి రోజునే వెయ్యి రూపాయల పైచిలుకు నష్టాన్ని చూసి రూ. 71,510 రూపాయల వద్దకు దిగజారింది.
అయితే, మే 2వ తేదీ 760 రూపాయల పెరుగుదలను చూసిన గోల్డ్ మార్కెట్ రూ. 72,270 రూపాయల వద్దకు చేరుకుంది. అయితే, మరుసటి రోజు నుండి మెల్లగా క్రిందకు దిగింది. అయితే ఈ రోజు తులానికి 220 రూపాయలు పెరిగిన గోల్డ్ రేట్ మళ్ళి తిరిగి 72 వేల రూపాయల మార్క్ ను చేరుకుంది.
Also Read: బడ్జెట్ ధరకే ANC TWS బడ్స్ కావాలా.. Amazon Sale నుండి అందుకోండి.!
ఈరోజు 24 క్యారెట్ గోల్డ్ రేట్ అప్డేట్ లోకి వెళితే, ఈరోజు ఉదయం రూ. 71,830 రూపాయల వద్ద ప్రారంభమైన గోల్డ్ రేట్, రూ.220 పెరిగి రూ. 72,050 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.
ఇక ఈ రోజు కొనసాగిన 24 క్యారెట్ గోల్డ్ రేట్ వివరాల్లోకి వెళితే, ఈరోజు రూ. 65,850 రూపాయల వద్ద మొదలైన గోల్డ్ రేట్, రూ.200 పెరిగి రూ. 66,050 రూపాయల వద్దలకు చేరుకుంది.
గమనిక : ఆన్లైన్ గోల్డ్ రేట్ మరియు లోకల్ మార్కెట్ గోల్డ్ రేట్ లలో మార్పులు ఉంటాయని గమనించాలి.