Gold Price: ఆల్ టైం గరిష్ట ధరను దాటిన బంగారం ధర.!
పసిడి ప్రియులకు అందనంత ఎత్తులో గోల్డ్ రేట్
గోల్డ్ మార్కెట్ ఇప్పుడు ఆల్ టైం గరిష్ట ధరను దాటేసింది
ఈరోజు కూడా 67 వేల వద్దనే క్లోజింగ్ ను నమోదు చేసింది
Gold Price: బంగారం ధర కట్టలు తెంచుకున్న నదీ ప్రవాహంలా అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతుంది. ఇప్పటికే భారీ ధర్నాలో నమోదు చేసిన గోల్డ్ మార్కెట్, ఇప్పుడు ఆల్ టైం గరిష్ట ధరను దాటేసింది. ముందే చెప్పినట్టుగా గోల్డ్ మార్కెట్ కి 2024 మొదటి రోజు నుండే శుభతరణం వరించింది. అయితే, ఇదంతా కూడా ఇన్వెస్టర్లకు మాత్రమే అని చెప్పాలి. పసిడి ప్రియులకు మాత్రం అందనంత ఎత్తుకు గోల్డ్ రేట్ చేరుకుంది.
Gold Price:
నిన్న మార్కెట్లో భారీగా పెరిగిన బంగారం ధర ఒక్కసారిగా 67 వేల మార్క్ పైకి చేరుకుంది. కేవలం నిన్న ఒక్కరోజే బంగారం ధర వెయ్యి రూపాయలకు పైగా పెరిగింది. అందుకే బంగారం ధర నిన్న 67 వేల మార్క్ ని దాటి దూసుకెళ్లింది.
అయితే, ఈరోజు గోల్డ్ రేట్ స్వల్పంగా క్రిందకు దిగింది. అయినా సరే గోల్డ్ రేట్ ఈరోజు కూడా 67 వేల వద్దనే క్లోజింగ్ ను నమోదు చేసింది. మరి ఈరోజు మార్కెట్లో కొనసాగుతున్న 24 క్యారెట్ మరియు 22 క్యారెట్ గోల్డ్ రేట్ ఎలా ఉందో పరిశీలిద్దామా.
Also Read: Lava O2 Launched: 16GB ర్యామ్ తో చౌక ధరలో విడుదలయ్యింది.!
ఈరోజు 24K గోల్డ్ రేట్
ఈరోజు 24 క్యారెట్ గోల్డ్ రేట్ స్వల్పంగా క్రిందకి దిగింది. లైవ్ అప్డేట్ విషయానికి వస్తే ఈరోజు ఉదయం రూ. 67,420 వద్ద మొదలైన 10గ్రామూల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 490 రూపాయలు క్రిందకు దిగి రూ. 66,930 వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.
ఈరోజు 22K గోల్డ్ రేట్
ఇక ఈరోజు ప్రధాన మార్కెట్లో కొనసాగుతున్న 22 క్యారెట్ గోల్డ్ విషయానికి వస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 61,350 వద్ద క్లోజింగ్ నమోదు చేసింది. ఈరోజు ఉదయం రూ. 61,800 వద్ద ప్రారంభమైన 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 450 రూపాయల నష్టాన్ని చూసి రూ. 61,350 వద్ద క్లోజింగ్ ను సెట్ చేసింది.