Gold Price: నిన్న మార్కెట్లో ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర ఈరోజు మాత్రం స్థిరంగా నిలబడింది. అయితే గోల్డ్ గరిష్ట రేటు వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇప్పటికే పెరిగిన బంగారం ధరతో పసిడి ప్రియులు నిరాశ చెందగా, గోల్డ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈరోజు మార్కెట్లో కొనసాగుతున్న బంగారం ధర లైవ్ అప్డేట్ ఏమిటో తెలుసుకుందాం.
ఈరోజు మార్కెట్లో బంగారం ధర స్థిరంగా కొనసాగింది. అంటే నిన్న నమోదు చేసిన రేటు వద్దనే బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. అయితే, ఈ వారం ప్రారంభం నుండి కనుక లెక్కిస్తే గోల్డ్ మార్కెట్ ఎత్తుపల్లాలని చూసింది. సోమవారం నాడు స్వల్పంగా క్రిందకు దిగిన బంగారం ధర మంగళవారం నాడు పెరుగుదలను చూసింది. కానీ, ఈరోజు మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా నిలకడగా కొనసాగింది.
Also Read: LG Smart Tv పైన భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన Flipkart
ఈరోజు 24 క్యారెట్ బంగారం ధర వివరాలను పరిశీలిస్తే, ఈరోజు ఉదయం రూ. 66,330 వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర నిలకడగా కొనసాగి, రూ. 66,330 రూపాయల వద్ద ఈరోజుటి క్లోజింగ్ ను సెట్ చేసింది.
అలాగే, 22K బంగారం ధర కూడా రూ. 60,380 రూపాయల వద్ద ప్రారంభమై అదే రేటు వద్ద కొనసాగింది మరియు అదే రేటు వద్ద క్లోజింగ్ ను సెట్ చేసింది.
ఈ నెలలో బంగారం ధర ఎన్నడూ చూడని రేవును గరిష్ట రేటును నమోదు చేసింది. అంతేకాదు, ప్రసుతం కూడా అదే గరిష్ట ధర వద్ద కొనసాగుతోంది.