Gold Price Update: ఈరోజు గోల్డ్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్ తెలుసుకోండి.!

Updated on 18-Dec-2023
HIGHLIGHTS

డిసెంబర్ నెలలో బంగారం ధర అంచనాలకు అందుకుండా పరుగెడుతోంది

ఈరోజు మాత్రం బంగారం ధర స్థిరంగా నిలబడింది

డిసెంబర్ నెల ఏ రేటు వద్ద బంగారం ధర మొదలయ్యిందో అక్కడికే వచ్చి చేరింది

Gold Price Update: డిసెంబర్ నెలలో బంగారం ధర అంచనాలకు అందుకుండా పరుగెడుతోంది. అయితే, ఈరోజు మాత్రం బంగారం ధర స్థిరంగా నిలబడింది. డిసెంబర్ నెల మొదలై రోజు నుండి మార్కెట్ లో బంగారం ధర అమాంతం పరుగులు తీసింది. అయితే, గోల్డ్ రేట్ స్థిరంగా మాత్రం నిలబడ లేదు. ఒక వారం భారీ లాభాలను చూస్తే, మరొక వారం భారీగా నష్టాలను చూసింది. ఎట్టకేలకు ఈరోజు మాత్రం డిసెంబర్ నెల ఏ రేటు వద్ద బంగారం ధర మొదలయ్యిందో అక్కడికే వచ్చి చేరింది.

Gold Price Update

బంగారం ధర

ఈరోజు బంగారం ధర స్థిరంగా కొనసాగింది. గత పదిరోజులుగా పడిలేచిన గోల్డ్ మార్కెట్ ఈరోజు స్థిరంగా నిలిచింది. ఈరోజు గోల్డ్ రేట్ రూ. 62,620 రూపాయల క్లోజింగ్ ను నమోదు చేసింది. అయితే, బంగారం ధరలో మార్పులు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.

24 క్యారెట్ గోల్డ్ రేట్

ఈరోజు మార్కెట్ లో 24 క్యారెట్ బంగారం ధర స్థిరంగా నిలిచింది. మార్కెట్ లో ఉదయం రూ. 62,510 రూపాయల వద్ద మొదలైన24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా కొనసాగి రూ. 62,620 రూపాయల క్లోజింగ్ ను నమోదు చేసింది. అయితే, గత శనివారం మార్కెట్ లో బంగారం ధర తులానికి రూ. 490 రూపాయలు క్రిందకు దిగింది.

Also Read : Soundbar Deals: ఈరోజు అమేజాన్ అందిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్స్.!

22 క్యారెట్ గోల్డ్ రేట్

ఇక ఈరోజు మార్కెట్ లో కొనసాగుతున్న 22 క్యారెట్ గోల్ రేట్ విషయానికి వస్తే, ఈరోజు రూ. 57,300 రూపాయల వద్ద మొదలైన 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ. 57,400 రూపాయల కొజింగ్ నమోదు చేసింది. అయితే, శనివారం నాడు తులానికి 450 రూపాయల నష్టాన్ని చూసింది.

గడిచిన 15 రోజుల గోల్డ్ మార్కెట్ అప్డేట్

గడిచిన 15 రోజుల గోల్డ్ మార్కెట్ అప్డేట్ ను పరిశీలిస్తే, గడిచిన 15 రోజుల్లో బంగారం ధర నష్టాలనే చూసినట్లు చెప్పవచ్చు. ఎందుకంటే, డిసెంబర్ 3న రూ. 63,760 రూపాయల వద్ద మొదలైన ఒక తులం బంగారం ధర ఈరోజు రూ. 62,620 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది. అంటే, గడిచిన 15 రోజుల్లో బంగారం ధర రూ. 1,140 రూపాయల క్రిందకు దిగింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :