Gold Price: విపరీతంగా పెరిగిన బంగారం ధర..New Price తెలిస్తే షాక్ అవుతారు.!
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగి పోతున్నాయి
నెల ప్రారంభంలో 57 వేల రూపాయల వద్ద కొనసాగిన Gold Price
Gold Price ప్రస్తుతం 60 వేల మార్క్ వద్ద కొసాగుతోంది
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగి పోతున్నాయి. అక్టోబర్ నెల ప్రారంభంలో 57 వేల రూపాయల వద్ద కొనసాగిన Gold Price ప్రస్తుతం 60 వేల మార్క్ వద్ద కొసాగుతోంది. అంటే, మీరే అర్ధం చేసుకోవచ్చు గోల్డ్ మార్కెట్ ఎంత వేగంగా పెరిగిపోతోందో అని. కేవలం మొన్న ఒక్కరోజే తులానికి రూ. 1,530 రూపాయలకు పైగా బంగారం ధర పెరుగుదలను నమోదు చేసి రికార్డ్ ధరను నమోదు చేసింది. మరి ఈరోజు మార్కెట్ లో బంగారం ధర ఎలా కొనసాగుతోందో చూద్దామా.
Today’s Gold Rate:
ఈరోజు మార్కెట్ లో కొనసాగుతున్న బంగారం ధరను పరిశీలిస్తే, ఈరోజు ప్రధాన మార్కెట్ లో 10 గ్రాముల బంగారం ధర రూ. 60,450 రూపాయల వద్ద మొదలై తులానికి రూ.340 రూపాయల క్రిందకు దిగి రూ. 60,110 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.
Also Read: Amazon అమేజింగ్ డీల్: సగం ధరకే బ్రాండెడ్ 55 ఇంచ్ QLED Woofer స్మార్ట్ టీవీ.!
24 Carat గోల్డ్ రేట్
ఇక ఈరోజు మన తెలుగు రాష్టాలలో కొనసాగుతున్న 24 Carat బంగారం ధర వివరాల్లోకి వెళితే, ఈరోజు ఉదయం రూ. 60,450 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ. 340 రూపాయలు తగ్గి రూ. 60,110 రూపాయల వద్ద ఈరోజు మార్కెట్ ను క్లోజ్ చేసింది.
22 Carat గోల్డ్ రేట్
అలాగే, 22 Carat బంగారం ధర విషయానికి వస్తే, ఈరోజు రూ. 55,410 రూపాయల వద్ద ప్రారంభమైన 22 Carat గోల్డ్ రేట్ కూడా రూ. 310 రూపాయలు క్రిందకు దిగి రూ. 55,100 రూపాయల వద్ద మార్కెట్ క్లోజింగ్ ను సెట్ చేసింది.
గత 15 రోజుల గోల్డ్ మార్కెట్ అప్డేట్
గత 15 రోజుల బంగారం ధర వివరాలను చూస్తే, గోల్డ్ మార్కెట్ భారీగా పెరుగుదలను నమోదు చేసింది. అక్టోబర్ 3 వ తేదీ రూ. 57,380 వద్ద ఉన్న గోల్డ్ రేట్ ఈరోజు రూ. 60,110 రూపాయల వద్ద నడుస్తోంది. అంటే, గత 15 రోజుల్లో గోల్డ్ రేట్ భారిగా పెరుగుధలను నమోదు చేసినట్లు మనం చూడవచ్చు.
గమనిక : ఆన్లైన్ మరియు లోకల్ మార్కెట్ బంగారం ధరలలో మార్పులు ఉంటాయి.