Gold Price Update: ఏప్రిల్ ప్రారంభ రోజు నుంచి మొదలైన గోల్డ్ రేట్ పెరుగుదల ఈరోజు కూడా కొనసాగింది. ఈరోజు కూడా గోల్డ్ మార్కెట్ భారీగా పెరగడంతో ఈరోజు కూడా రికార్డు ధరను హిట్ చేసింది. గత శనివారం మార్కెట్లో స్వల్పంగా తగ్గిన బంగారం ధర ఈరోజు మళ్లీ పెరగడంతో 73 వేల రూపాయల పైకి చేరుకుంది. ఈ నెలలో బంగారం ధరకు రెక్కలు వచ్చాయి మరియు ఎన్నడూ చూడని భారీ మార్పులను చూసింది.
గత వారం మొత్తం భారీగా పెరుగుదలను చూసిన గోల్డ్ మార్కెట్, వారాంతంలో స్వల్పంగా క్రిందికి దిగింది. మళ్లీ గోల్డ్ ధర తగ్గుతుందేమో అని సంబరపడిన పసిడి ప్రజలకు ఆ ఆనందం ఒక్కరోజు కూడా నిలవలేదు. ఈరోజు మొదలవుతూనే బంగారం ధర భారీగా పెరుగుదల నమోదు చేసింది.
శనివారం నాడు తులానికి 760 రూపాయల భారీగా రేటు నష్టపోవడంతో రూ. 72,550 రూపాయల వద్ద మార్కెట్ ను క్లోజ్ చేయవలసి వచ్చింది. అయితే, ఈరోజు గోల్డ్ రేట్ మళ్ళీ తిరిగి తులానికి 600 రూపాయలు పుంజుకోవడంతో రూ. 73,150 రూపాయల వద్దకు చేరుకుంది.
ఇక ఓవరాల్ గా ఈ నెల కొనసాగిన గోల్డ్ మార్కెట్ అప్డేట్లను పరిశీలిస్తే, బంగారం ధర భారీగానే పెరుగుదలను నమోదు చేసింది. మార్కెట్ నిపుణులు వేస్తున్న అంచనా ధరలు పసిడి ప్రజలకు మరింత భారంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే, బంగారం ధర త్వరలోనే 80వేలకు చేరుకున్నా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదని నిపుణులు చెప్తున్నారు.
Also Read: Realme P1 5G: 15 వేల బడ్జెట్ లో కాంపిటీటివ్ ఫీచర్స్ తో వచ్చింది.!
అయితే గోల్డ్ మార్కెట్ ను అంచనా వేయడం అంత సులభమైన పనేమి కాదు. కాబట్టి, ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. చూడాలి గోల్డ్ మార్కెట్ ఏ విధంగా మలుపు తిరుగుతుందో అని.
ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 600 పెరిగి రూ. 73,150 రూపాయల వద్ద కొనసాగుతోంది.
అలాగే, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేట్ కూడా రూ. 550 రూపాయలు పెరిగి రూ. 67,050 రూపాయల వద్దకు చేరుకుంది.