Gold Price Update: ఈరోజు కూడా దిగజారిన గోల్ మార్కెట్.!
గోల్డ్ మార్కెట్ 61 వేల రూపాయల మార్క్ ను చేరుకుంది
నిన్న మొన్నటి వరకూ గోల్డ్ మార్కెట్ భారీ పెరుగుదలను చూసింది
డిసెంబర్ నెల అతి ఎక్కువ మిశ్రమ ఫలితాలను చూసిన నెలగా నిలిచింది
Gold Price Update: ఈరోజు కూడా దిగజారిన గోల్ మార్కెట్ 61 వేల రూపాయల మార్క్ ను చేరుకుంది. వాస్తవానికి, నిన్న మొన్నటి వరకూ గోల్ మార్కెట్ భారీ పెరుగుదలను చూసింది. అయితే, ప్రస్తుతం బంగారం ధర ఈ నెల కనిష్ఠ ధరను అంటిపెట్టుకొని తిరుగుతోంది. నిజానికి, 2023 సంవత్సరం గోల్డ్ మార్కెట్ లో డిసెంబర్ నెల అతి ఎక్కువ మిశ్రమ ఫలితాలను చూసిన నెలగా నిలిచింది. ఎందుకంటే, డిసెంబర్ నెలలో 64 వేలకు పైగా రేటును చూసిన గోల్డ్ మార్కెట్ 61 వేల కనిష్ఠాన్ని కూడా చూసింది.
Gold Price Update
ప్రసుతం మార్కెట్ లో కొనసాగుతున్న గోల్డ్ రేట్ వివరాల్లోకి వెళితే, ఈరోజు ప్రధాన మార్కెట్ లో గోల్డ్ రేట్ నష్టాలను చూసింది. అయితే, పెద్ద మొత్తంగా కాదు కాబట్టి గోల్డ్ రేట్ పైన అంతగా ప్రభావం చూపదు. ఈరోజు ప్రధాన మార్కెట్ లో బంగారం ధర రూ. 61,800 రూపాయల వద్ద కొనసాగింది.
ఇక గడిచిన 10 రోజుల గోల్డ్ మార్కెట్ ను పరిశీలిస్తే బంగారం ధర భారీగా ఎత్తు పల్లాలను చూసింది. ఎంత వేగంగా అయితే గోల్డ్ రేట్ పెరిగిందో, అంతే వేగంగా గోల్డ్ రేట్ పడిపోయింది కూడా. అయితే, ప్రసుతం గోల్డ్ రేట్ పసిడి ప్రియులకు అనువైనదిగా కొనసాగుతోంది.
Also Read : Ambrane Force 10K పవర్ బ్యాంక్ ను విలక్షణమైన ఆఫర్ తో లాంచ్ చేసింది.!
24 క్యారెట్ గోల్డ్ రేట్
ఈరోజు 24 క్యారెట్ గోల్డ్ రేట్ స్థిరంగా కొసాగింది. రూ. 61,910 రూపాయల వద్ద మొదలైన గోల్డ్ రేట్ తులానికి 110 రూపాయలు క్రిందకు దిగడంతో రూ. 61,800 రూపాయల వద్ద స్థిరంగా నిలిచింది.
22 క్యారెట్ గోల్డ్ రేట్
22 క్యారెట్ గోల్డ్ రేట్ కూడా ఈరోజు స్థిరంగానే కొనసాగింది. రూ. 56,750 రూపాయల వద్ద మొదలైన 10 గ్రాముల 22 క్యారెట్ ఆర్నమెంట్ గోల్డ్ రేట్ 100 రూపాయలు దిగజారి రూ. 56,650 రూపాయల వద్దకు చేరుకుంది.
అయితే, గోల్డ్ మార్కెట్ మళ్ళీ పెరుగుదలను చూడవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతన్నారు. అయితే, ఈ నెలలో కొనసాగుతున్న గోల్డ్ మార్కెట్ దేనికి అంచనాలకు విరుద్ధంగా కొనసాగుతోంది. నిపుణుల అంచనాలు యెంత వరకూ నిజమవుతాయా వేచి చూడాలి.