మే 11 గోల్డ్ అప్డేట్: ఈరోజు కూడా రికార్డ్ ధరలో బంగారం.!
ఈ వారంలో మూడు రోజులు వరుసగా పెరిగిన బంగారం ధర
మరింత పెరగొచ్చని చెబుతున్న నిపుణులు
గోల్డ్ రేట్ఈ రోజు కూడా హైఎస్ట్ రేటులో కొనసాగుతోంది
May 11 గోల్డ్ అప్డేట్: ఈరోజు కూడా మార్కెట్ లో రికార్డ్ స్థాయి రేటులోనే బంగారం ధర కొనసాగుతోంది. ఈ వారంలో మూడు రోజులు వరుసగా పెరిగిన బంగారం ధర ఈరోజు స్థిరంగా నిలిచి, నిన్న మరియు ఈరోజు కూడా హైఎస్ట్ రేటులో కొనసాగుతోంది. ఇప్పటికే బంగారం ధరలు ఆకాశాన్ని అంటగా, మరింత పెరగొచ్చని చెబుతున్న నిపుణుల సూచనలు, పసిడి ప్రియులకు నిరాశను కలిగిస్తున్నాయి.
అయితే, పెరుగుతున్న గోల్డ్ రేట్ తక్కువ రేటుకే షేర్స్ ను కొనుగోలు చేసిన వారికి లాభాల పంటను పండిస్తుంటే, గోల్డ్ కొనాలని చూస్తున్న వారికి మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి. May 11 గోల్డ్ మార్కెట్ అప్డేట్ మరియు రేట్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ చూడవచ్చు.
Gold Live price:
ఈరోజు Gold Live price అప్డేట్ ను చూస్తే, ఈరోజు మార్కెట్ స్టేబుల్ గా వుంది మరియు నిన్నటి ధరలోనే సూచీలు కొనసాగుతున్నాయి. ఈరోజు మార్కెట్ లో ఒక తులం 24K గోల్డ్ రేట్ రూ. 62,130 గా ఉండగా,ఒక తులం 22K గోల్డ్ రేట్ రూ. 56,950 రేటుతో కొనసాగుతోంది.
ఇక తెలుగు రాష్ట్రాలలో గోల్డ్ మార్కెట్ మరియు రేట్స్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ లలో కూడా 10గ్రాముల 24K గోల్డ్ రేట్ రూ. 62,130 గా ఉండగా, 10గ్రాముల 22K గోల్డ్ రేట్ రూ. 56,950 ధర వద్ద కొనసాగుతోంది.