Gold Price: 62 వేల మార్క్ కు దిగజారిన గోల్డ్ రేట్.. ఈరోజు రేటు ఎంతంటే.!

Gold Price: 62 వేల మార్క్ కు దిగజారిన గోల్డ్ రేట్.. ఈరోజు రేటు ఎంతంటే.!
HIGHLIGHTS

ప్రతిరోజూ కూడా నష్టాలను చూసిన గోల్డ్ మార్కెట్

గోల్డ్ మార్కెట్ ప్రస్తుతం 62 వేల మార్క్ వద్ద కొసాగుతోంది

గడిచిన 10 రోజుల్లో మెల్ల మెల్లగా క్రిందకు దిగిన గోల్డ్ రేట్

Gold Price: గడిచిన 10 రోజులుగా వరుసగా ప్రతిరోజూ కూడా నష్టాలను చూసిన గోల్డ్ మార్కెట్ ప్రస్తుతం 62 వేల మార్క్ వద్ద కొసాగుతోంది. అయితే, గోల్డ్ మార్కెట్ 2024 లో గరిష్టాన్ని చూసే అవకాశం ఉందని చెబుతున్న నిపుణుల అంచనా రేటు మాటను ఒమ్ము చేస్తుందో లేక నిజం చేస్తుందో వేచి చూడాల్సి ఉంటుంది. వాస్తవానికి, 2024 ప్రారంభం రోజున గోల్డ్ మార్కెట్ 64 వేల రూపాయల మార్క్ వద్ద గ్రాండ్ వెల్కమ్ ఇచ్చింది. అయితే, గడిచిన 10 రోజుల్లో మెల్ల మెల్లగా క్రిందకు దిగడంతో గోల్డ్ మార్కెట్ ఈరోజు 62 వేల మార్క్ ను చూడవలసి వచ్చింది.

Gold Price Live

ఇక ఈరోజు మార్కెట్ లో కొనసాగుతున్న బంగారం ధర వివరాల్లోకి వెళితే, ఈరోజు గోల్డ్ మార్కెట్ స్థిరంగా కొనసాగింది. ఈ వారం ప్రారంభం నుండి కూడా రోజూ నష్టాలను చూసిన గోల్ మర్కెట్ ఈరోజు మాత్రం నిశ్చలంగా కొనసాగింది.

gold price update

24 క్యారెట్ గోల్డ్ రేట్

ఈరోజు మార్కెట్ లో కొనసాగుతున్న 24 క్యారెట్ గోల్డ్ రేట్ ను చూస్తే, ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ. 62,950 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగింది. అయితే, గడిచిన 10 రోజుల్లో 10 గ్రాముల 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,140 వరకూ క్రిందకు దిగజారింది.

Also Read: Amazon Great Republic Day Sale 2024 జనవరి 13 నుండి మొదలువుతుంది.!

22 క్యారెట్ గోల్డ్ రేట్

ఇక ఈరోజు మార్కెట్ నడుస్తున్న 22 క్యారెట్ గోల్డ్ రేట్ విషయానికి వస్తే, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ ఆర్నమెంట్ బంగారం ధర రూ. 57,700 రూపాయల వద్ద స్థిరంగా నడిచింది. గడిచిన 10 రోజుల్లో 22 క్యారెట్ ఆర్నమెంట్ గోల్ రేట్ కూడా తులానికి రూ. 1,050 రూపాయలు క్రిందకు దిగింది.

జనవరి 2024 గోల్డ్ రేట్ అప్డేట్

2024 గోల్డ్ రేట్ అప్డేట్ ను చూస్తే, పైన తెలిపి విధంగానే ఈ నెల ప్రారంభం గరిష్ట రేటు వద్ద మొదలైన గోల్డ్ మార్కెట్, 10 రోజుల్లో రూ. 1,100 వరకూ నష్టాన్ని చూసింది. అంటే, గోల్డ్ మార్కెట్ మదుపరులకు నష్టాలను, మార్కెట్ లో కొనుగోలు చేసే వారికి ఊరటని అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo