Gold Price: బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.!

Updated on 05-Sep-2022
HIGHLIGHTS

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధర కొనుగోలుదారులకు అనుకూలంగా వుంది

గత వారం మొత్తం కూడా బంగారం రేటు నేల చూపులు చూసింది

Gold Price: బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. ఎందుకంటే, ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధర కొనుగోలుదారులకు అనుకూలంగా వుంది. గత వారం మొత్తం కూడా బంగారం రేటు నేల చూపులు చూసింది. ఈరోజు కూడా మార్కెట్లో బంగారం రేటులో పెద్దగా మార్పు లేదు. ఈరోజు కేవలం తులానికి 100 రూపాయలు మాత్రమే గోల్డ్ రేట్ పెరిగింది. అంటే, ఈరోజు బంగారం ధర స్థిరంగానే కొనసాగుతోంది. ఇక గోల్డ్ రేటును పరిశీలిస్తే, నాలుగు నెలల కనిష్ఠానికి ప్రస్తుతం గోల్డ్ రేట్ చేరుకుంది. ఈరోజు దేశ రాజధానితో సహా తెలుగు రాష్టాల ప్రధాన నగరాలలో బంగారం ధర ఎలా కొనసాగుతోందో తెలుసుకుందామా.

నిన్న10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,650 రూపాయలుగా ఉండగా, ఈరోజు 46,750 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.51,000 వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,000 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,000 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,000 గా ఉంది. ఈరోజు కూడా    దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,360 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,660 గా ఉంది.

ప్రతి రోజు Gold Live అప్డేట్స్ కోసం Click Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :