Gold Price: ఈరోజు మళ్ళీ పతనమైన బంగారం ధర

Updated on 31-Aug-2022
HIGHLIGHTS

నిన్న దేశవాప్తంగా స్థిరంగా కొనసాగిన బంగారం ధర ఈరోజు స్వల్పంగా తగ్గింది

ఈరోజు బంగారం ఈ నెల కనిష్ఠానికి చేరుకుంది

ఈరోజు కూడా గోల్డ్ రేట్ డౌన్ ట్రేడ్ చేస్తోంది

నిన్న దేశవాప్తంగా స్థిరంగా కొనసాగిన బంగారం ధర ఈరోజు స్వల్పంగా తగ్గింది. అంతేకాదు, ఈరోజు బంగారం ఈ నెల కనిష్ఠానికి చేరుకుంది మరియు ఈరోజు కూడా డౌన్ ట్రేడ్ చేస్తోంది. ఈరోజు మార్కెట్లో బంగారం ధర తులానికి 280 రూపాయలు పతనమయ్యింది. సోమవారం తులానికి 180 రూపాయలు పతనమైన బంగారం ధర ఈరోజు కూడా పడిపోయింది. మరి ఈరోజు తెలుగు రాష్టాల ప్రధాన నగరాలు మరియు దేశ రాజధానిలో బంగారం ధర వివరాలు ఏమిటో తెలుసుకుందామా.

నిన్న10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,240 రూపాయలుగా ఉండగా, ఈరోజు 47,000 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.51,270 వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,270 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,270 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,270 గా ఉంది. ఈరోజు కూడా    దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,540 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,860 గా ఉంది.

ప్రతి రోజు Gold Live అప్డేట్స్ కోసం Click Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :