Gold Price Update: నిలకడగా బంగారం ధర..మార్కెట్ అప్డేట్ తెలుసుకోండి.!

Gold Price Update: నిలకడగా బంగారం ధర..మార్కెట్ అప్డేట్ తెలుసుకోండి.!
HIGHLIGHTS

గత 10 రోజులుగా మార్కెట్ లో పడిపోతూ వస్తున్న బంగారం ధర

బంగారం ధర ఈరోజు నిలకడగా కొనసాగుతోంది

బంగారం ధర ప్రస్తుతం ఒకేవద్ద స్థిరంగా కొనసాగుతోంది

Gold Price Update: గత 10 రోజులుగా మార్కెట్ లో పడిపోతూ వస్తున్న బంగారం ధర ఈరోజు నిలకడగా కొనసాగుతోంది. వాస్తవానికి, గోల్డ్ మార్కెట్ ఇటీవల బాగా పుంజుకొని గత ఆరు నెలల గరిష్టాన్ని కూడా నమోదు చేశాయి. అయితే, ప్రస్తుతం కొనసాగుతున్న అనిశ్చిత ఒడిదుడుకుల కారణంగా గోల్డ్ మార్కెట్ ఒత్తిడి ఎదుర్కొంటోంది. బంగారం ధర ప్రస్తుతం ఒకేవద్ద స్థిరంగా కొనసాగుతోంది. 

Gold Price Update:

ఈరోజు ఉదయం రూ.51,350 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయలు పెరిగి రూ.51,450 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,020 నుండి క్రిందకు దిగి రూ.56,120 రూపాయల వద్దకు చేరుకుంది.    

ఈరోజు బంగారం ధర

ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,450 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,120 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,450 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,120 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,600 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.56,270 గా ఉంది. అలాగే, ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నై లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,070 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,800 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo