ఈరోజు మార్కెట్లో బంగారం ధర ఎవరికి అనుకూలం.!

Updated on 13-Sep-2022
HIGHLIGHTS

ఈరోజు మార్కెట్లో బంగారం ధర ఎవరికి అనుకూలం

గత వారం భారీగా తగ్గిన బంగారం ధర కొనుగోలుదారులను ఆకర్షించింది

ఈరోజు మార్కెట్లో గోల్డ్ రేట్ ఎలా ఉన్నదో చూద్దాం

ఈరోజు మార్కెట్లో బంగారం ధర ఎవరికి అనుకూలంగా వుంది. అంటే, బంగారం కొనడానికా లేదా అమ్మకూడానికా అని ఆలోచిస్తున్నారా? అయితే, ముందుగా ఈరోజు మార్కెట్లో బంగారం ధర ఎలా ఉన్నదో తెలుసుకోవాలి. అందుకే, ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలతో సహా దేశరాజధానిలో బంగారం ధర ఎలా కొనసాగుతుందో చూద్దాం. గత వారం భారీగా తగ్గిన బంగారం ధర కొనుగోలుదారులను ఆకర్షించింది. అయితే, తరువాత మెల్లగా పుంజుకున్నా కూడా మధ్యలో మళ్ళీ తగ్గడంతో బంగారం రేటు నిలకడగా కొనసాగుతోంది. అందుకే, ఈరోజు మార్కెట్లో గోల్డ్ రేట్ ఎలా ఉన్నదో చూద్దాం.

నిన్న10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,750 రూపాయలుగా ఉండగా, ఈరోజు కూడా  46,730 రూపాయలతో నిలకడగానే కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.51,990 వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,730 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,090 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,740 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,000 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,730 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,980 గా ఉంది. ఈరోజు కూడా    దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,250 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,550 గా ఉంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :