Gold Price Record: ఈరోజు రికార్డ్ రేటును సెట్ చేసిన గోల్డ్ మార్కెట్.!

Updated on 20-May-2024
HIGHLIGHTS

గోల్డ్ రేట్ ఈరోజు ఎన్నడూ చూడని రికార్డ్ రేటును సెట్ చేసింది

గోల్డ్ మార్కెట్ పైన ఇన్వెస్ట్ చేసిన మదుపరులకు మాత్రం పండగే

ఇప్పటికే తులానికి రూ.540 రూపాయలు పెరిగిన గోల్డ్ రేట్

Gold Price Record: గోల్డ్ రేట్ ఈరోజు ఎన్నడూ చూడని రికార్డ్ రేటును సెట్ చేసింది. గత నెలలో గోల్డ్ రేటు భారీగా ఉందనుకుంటే, ఈ నెలలో మరింత దారుణంగా పెరిగి పోయింది. ఇప్పటికే పెరిగిన గోల్డ్ రేట్ లతో పసిడి ప్రియులు గగ్గోలు పెడుతుంటే, ఇప్పుడు గోల్డ్ మళ్ళీ షాకిచ్చింది. అసలే పెళ్లిళ్ల సీజన్, అందులోను గోల్డ్ రేట్ ప్రియం. ఇంక పసిడి ప్రియుల కష్టాలు గురించి చెప్పేదేముంది. అయితే, గోల్డ్ మార్కెట్ పైన ఇన్వెస్ట్ చేసిన మదుపరులకు మాత్రం పండగే అనుకోండి. మరి ఈ రోజు గోల్డ్ మార్కెట్ లో నడుస్తున్న రేట్ మరియు అప్డేట్ లు ఏమిటో చూద్దామా.

Gold Price Record

వాస్తవానికి, మే 15 వ తేదీ నుండి గోల్డ్ రేట్ పెరగడం మొదలు పెట్టింది. మే 15 తేదీ వరకు దాదాపు స్థిరంగా ఉన్న గోల్డ్ మార్కెట్ మెల్ల మెల్లగా పెరగడం మొదలు పెట్టింది. మే 16 వ తేదీ తులానికి రూ. 770 రూపాయలు, మే 18న తులానికి రూ. 870 రూపాయలు పెరిగిన గోల్డ్ రేట్ రూ. 74,620 రూపాయలు వద్ద క్లోజింగ్ సెట్ చేసింది.

Gold Price Record

ఇక ఈరోజు ఉదయం నుంచి మళ్ళీ మొదలైన గోల్డ్ పెరుగుదలతో ఇప్పటికే తులానికి రూ.540 రూపాయలు పెరిగిన గోల్డ్ రేట్ రూ. 75,160 రూపాయల రికార్డ్ రేటును నమోదు చేసింది. ఇప్పటివరకు గోల్డ్ మార్కెట్ చూడని రికార్డ్ రేటు, ఈరోజు గోల్డ్ మార్కెట్ టచ్ చేసింది. ఈ రేటు 80 వేలకు చేరుకోవచ్చని నిపుణుల అంచనాలు ఇప్పుడు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ఈ మాటలు ఎప్పటికి నిజమవుతాయో చూడాలి అంటున్నారు, విమర్శకులు.

Also Read: Infinix GT 20 Pro: ఈ టాప్ 5 ఫీచర్స్ తో రేపు లాంచ్ అవుతోంది.!

ఈరోజు 24 క్యారెట్ గోల్డ్ రేట్ అప్డేట్

ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 540 రూపాయలు పెరిగి రూ. 75,160 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఉదయం 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ . 74,620 రూపాయల వద్ద మొదలయ్యింది.

ఈరోజు 22 క్యారెట్ గోల్డ్ రేట్ అప్డేట్

ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 500 రూపాయలు పెరిగి రూ. 68,900 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ . 68,400 రూపాయల వద్ద మొదలయ్యింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :