Gold Price: ఎంత తగ్గిందో.. అంత పెరిగింది..ఈరోజు గోల్డ్ అప్డేట్ ఇదే.!
ఇండియన్ మార్కెట్లో గోల్డ్ గడ్డుకాలాన్ని చవిచూస్తోంది
గోల్డ్ రేట్ అంచనాలు తారుమారు అవుతున్నాయి
నిన్న క్రిందకు దిగిన గోల్డ్ రేట్ ఈరోజు అంతే పైకి చేరుకుని స్థిరంగా కొనసాగుతోంది
ఇండియన్ మార్కెట్లో గోల్డ్ గడ్డుకాలాన్ని చవిచూస్తోంది. US Fed అనుసరిస్తున్న వడ్డీ రేట్లు మరియు డాలర్ తో రూపాయి మారకం విలువ వంటి అంశాలతో గోల్డ్ రేట్ అంచనాలు తారుమారు అవుతున్నాయి. దీపావళి ముందు వరకూ బంగారం ధర రోజురోజుకూ పడిపోయింది మరియు దాదాపుగా 10 నెలల కనిష్ఠాన్ని కూడా ఇదే నెలలో గోల్డ్ మార్కెట్ చవిచూసింది. ఒకరోజు రేటు పెరిగితే మరొక రోజు మార్కెట్ లో గోల్డ్ రేట్ పడిపోతోంది. ఇదే దారిలో నిన్న క్రిందకు దిగిన గోల్డ్ రేట్ ఈరోజు అంతే పైకి చేరుకుని స్థిరంగా కొనసాగుతోంది. ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల్లో గోల్డ్ మార్కెట్ ఎలా ఉన్నదో చూద్దాం.
Gold Price:
నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,850 రూపాయలుగా ఉండగా, ఈరోజు కొంచెం పెరిగిన గోల్డ్ మార్కెట్ 47,000 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.51,280 రూపాయల వద్ద కొనసాగుతోంది.
ఈరోజు బంగారం ధర
ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,280 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,010 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,290 గా ఉంది.
ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.51,430 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,720 గా ఉంది.