Gold Price: నిన్నటి దారిలోనే నడిచిన గోల్డ్ ట్రెండ్ తో దేశవ్యాప్తంగా ఈరోజు కూడా బంగారం ధర పడిపోయింది. నిన్న మార్కెట్ లో స్వల్పంగా క్రిందకు దిగిన గోల్డ్ రేట్ ఈరోజు మరింతగా దిగ్గజారి, ఈ రెండు రోజుల మీద తులానికి రూ. 500 వరకూ నష్టాలను చూసింది. అంతేకాదు, ఈ నెల కనిష్ట గోల్డ్ రేట్ ను మరొకసారి టచ్ చేసింది. గోల్డ్ ఇన్వెస్టర్లు మరియు ఎక్కువ మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేసే వారికి ఇది శుభ పరిణామం కాగా, ఇప్పటికే గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసిన మదుపర్లకు కొంత నిరాశను కలిగిస్తుంది.
ఇక ఈరోజు మార్కెట్ లో నడుసున్న బంగారం ధర మరియు ఈరోజు మార్కెట్ వివరాల్లోకి వెళితే, ఈరోజు రూ. 59,730 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24 carat బంగారం ధర రూ. 280 రూపాయలు క్రిందకు దిగి రూ. 59,450 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది. అలాగే, రూ. 54,750 price వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 carat బంగారం ధర రూ. 250 రూపాయలు దిగజారి రూ. 54,500 రూపాయల వద్ద ఈరోజుటి క్లోజింగ్ ను నమోదు చేసింది.
Also Read: Big News: ఈ రెండు Vivo Smart Phones పైన భారీ తగ్గింపు అనౌన్స్ చేసిన వివో.!
ఈ వారం బంగారం మార్కెట్ అప్డేట్ లోకి వెళితే, సెప్టెంబర్ 24 మరియు సెప్టెంబర్ 24 రెండు రోజులు స్థిరంగా ఉన్న బంగారం ధర సెప్టెంబర్ 26 మరియు సెప్టెంబర్ 27 రెండు రోజులు కూడా బంగారం ధర పడిపోతూ వచ్చింది. ఈ రెండు రోజుల మీద రూ. 500 రూపాయలు నష్టాన్ని గోల్డ్ మార్కెట్ చూసింది.
ఇక సెప్టెంబర్ నెల గోల్డ్ మార్కెట్ వివరాల్లోకి వెళితే, సెప్టెంబర్ నెల ప్రారంభంలో రూ. 60, 320 రూపాయల హైయెస్ట్ రేటు ను చూసిన బంగారం మార్కెట్ రెండు సార్లు రూ. 59,450 రూపాయల కనిష్ఠాన్ని చూసింది.
తెలుగు రాష్ట్రాలలో ఈరోజు గోల్డ్ రేట్ విషయానికి వస్తే, ఈరోజు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలలో ఒక తులం 24 క్యారెట్ బంగారం ధర రూ. 59,730 రూపాయలుగా ఉండగా ఒక తులం 22 క్యారెట్ బంగారం ధర రూ. 59,730 రూపాయలుగా వుంది.
గమనిక: ఆన్లైన్ గోల్డ్ రేట్ మరియు లోకల్ మార్కెట్ గోల్డ్ రేట్ లలో మార్పులు ఉంటాయని గమనించాలి.