Gold Live: పడిపోతున్న బంగారం ధర..ఈరోజు రేటు ఏంతంటే.!

Gold Live: పడిపోతున్న బంగారం ధర..ఈరోజు రేటు ఏంతంటే.!
HIGHLIGHTS

రోజురోజుకు పడిపోతున్న బంగారం ధర

బంగారం ధర ఈరోజు 10 రోజుల కనిష్టాన్ని తాకింది

ఈరోజు గోల్డ్ మార్కెట్ ఎలా ఉన్నదో తెలుసుకోండి

రోజురోజుకు పడిపోతున్న బంగారం ధర ఈరోజు 10 రోజుల కనిష్టాన్ని తాకింది. వాస్తవానికి, ఫిబ్రవరి 15వ తేదీ నుండి గోల్డ్ మార్కెట్ రోజురోజుకు స్వల్పంగా పడిపోతూ వచ్చింది. మధ్యలో కొన్ని సరోజులు స్థిరంగా కొనసాగినా టోటల్ గా చూస్తే ఈ 10 రోజుల్లో దాదాపుగా తులానికి 1000 రూపాయల వరకు బంగారం ధర క్రిందకు దిగింది. మరి ఈరోజు గోల్డ్ మార్కెట్ ఎలా ఉన్నదో తెలుసుకోండి.  

Gold Rate:

నిన్న ప్రధాన మార్కెట్ లో రూ.52,800 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయలు క్రిందకు దిగి రూ.51,700 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,510 నుండి క్రిందకు దిగి రూ.56,400 రూపాయల వద్దకు చేరుకుంది.    

ఈరోజు బంగారం ధర

ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,700 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,400 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,700 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,400 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,950 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.56,610 గా ఉంది. అంటే, ఢిల్లీ గోల్డ్ మార్కెట్ ధరలో ఎటువంటి మార్పులు జరగలేదు. అలాగే, ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నై లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,350 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,110 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo